ETV Bharat / city

అరుదైన శస్త్రచికిత్సలో గుంటూరు వైద్యుల సత్తా

author img

By

Published : Dec 17, 2020, 7:46 AM IST

పశ్చిమ బెంగాల్​కు చెందిన ఓ మహిళ రొమ్ములో ఏర్పడిన 6 కిలోల కణితిని.. గుంటూరు ఒమెగా ఆస్పత్రి వైద్యులు విజయవంతంగా తొలగించారు. చీఫ్ సర్జికల్ ఆంకాలజిస్టు డా. యంజి నాగకిషోర్ నేతృత్వంలోని వైద్య బృందం.. అత్యంత క్లిష్టమైన ఈ శస్త్ర చికిత్సను విజయవంతంగా నిర్వహించింది.

rare cancer operation
అరుదైన క్యాన్సర్ శస్త్రచికిత్స విజయవంతం

క్లిష్టమైన, అరుదైన శస్త్రచికిత్సల్లో గుంటూరు వైద్యులు మరోసారి సత్తా చాటారు. ఛాతీ క్యాన్సర్​తో బాధపడుతున్న పశ్చిమ బెంగాల్​కు చెందిన 33 ఏళ్ల మహిళ నుంచి.. 6 కిలోల బరువున్న కణితిని బయటకు తీశారు. విపరీతమైన నొప్పి, ఆయాసం వంటి ఇబ్బందులు ఎదుర్కొన్న ఆమెను.. గుంటూరు ఒమెగా క్యాన్సర్ ఆస్పత్రిలో బంధువులు చేర్చారు. ఇక్కడి వైద్యులు కష్టమైన శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు.

అరుదైన క్యాన్సర్ శస్త్రచికిత్స విజయవంతం

రెండేళ్ల కిందట ఆ మహిళకు మొదటిసారి కణితిని తీయగా.. రెండోసారి ఏకంగా 6 కిలోల మేర ఏర్పడింది. రొమ్ములో 27 X 24 సెం.మీ వైశాల్యంతో కణితిని నిర్థారించి.. అతికష్టం మీద తొలగించారు వైద్యులు. శస్త్రచికిత్స చేసిన వైద్య బృందానికి చీఫ్ సర్జికల్ ఆంకాలజిస్టు డా. యంజి నాగకిషోర్ నేతృత్వం వహించగా.. డా. శౌరయ్య, ఎనస్థియాలజిస్టు, శ్రీకాంత్ బోగా, జాస్తి విజయకృష్ణ, ఎన్.వి.యస్. ప్రవీణ్​లు పాల్గొని తమ వంతు కృషి చేశారు. రొమ్ములో ఇంత పెద్ద కణితి అభివృద్ధి చెందడాన్ని.. అత్యంత అరుదైన సంఘటనగా భావించాల్సి ఉంటుందని వైద్యులు తెలిపారు. అత్యంత క్లిష్టమైన శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తిచేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి:

ఏడాదిగా అలుపెరగని పోరాటం....అమరావతే నినాదం

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.