ETV Bharat / city

మట్టిని కరిగించేయ్​... జేబులు నింపేయ్​... - గుంటూరు జిల్లా నల్లమడ వాగులో అక్రమ తవ్వకాలు

కాదేది అవినీతికి అనర్హం అన్న తీరుగా మారింది గుంటూరు జిల్లాలో మట్టి మాఫియా వ్యవహారం. నిబంధనలకు విరుద్ధంగా వాగుల పక్కనే అక్రమంగా తవ్వకాలు చేస్తున్నారు. జిల్లాలోని నల్లమడ వాగు కట్టలనూ మట్టి అక్రమార్కులు వదలటం లేదు. వరదల సమయంలో ముంపు నుంచి కాపాడే మట్టి దిబ్బలను సైతం కరిగించేసి జేబులు నింపుకుంటున్నారు. వాగు కట్ట లేకపోతే వేల ఎకరాలు ముంపునకు గురవుతాయని నల్లమడ రైతులు ఆవేదన చెందుతున్నారు.

మట్టి మాఫియా... కట్టలు కొట్టేస్తోంది..!
మట్టి మాఫియా... కట్టలు కొట్టేస్తోంది..!
author img

By

Published : Jul 2, 2020, 5:58 PM IST

మట్టి మాఫియా... కట్టలు కొట్టేస్తోంది..!

గుంటూరు జిల్లా బాపట్ల పరిధిలో పేదలకు అందిస్తున్న ఇళ్ల స్థలాలు పూడ్చేందుకు... ప్రభుత్వం రూ.కోట్లు కేటాయించింది. దీంతో మట్టికి గిరాకీ పెరిగింది. మట్టి విక్రయించి సొమ్ము చేసుకునేవారి కళ్లు పోరంబోకు భూముల్లోని మట్టి దిబ్బలు, కాల్వలు, వాగుల కట్టలపై పడ్డాయి. ఓ నేత గుంటూరు- ప్రకాశం జిల్లాల సరిహద్దులోని నల్లమడ వాగు కట్టలను అక్రమంగా తవ్వి విక్రయిస్తున్నారని స్థానిక రైతులు ఆరోపిస్తున్నారు. చెరువుజమ్ములపాలెం- మూలపాలెం మధ్య ఉన్న మట్టి దిబ్బలను తవ్వటానికి అన్నదాతలు అభ్యంతరం వ్యక్తం చేశారు.

అతిపెద్ద మురుగు కాల్వ

వంద మీటర్ల మేర తవ్వటంతో వాగు కట్ట బలహీనపడింది. భారీవర్షాలు కురిస్తే పల్నాడుతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చే వరద నీటితో కట్టలు కొట్టుకుపోయి వేల ఎకరాల్లో పంటలతో పాటు బాపట్ల పట్టణం, గ్రామాలు మునిగిపోయే ప్రమాదం ఉందని రైతులు చెబుతున్నారు. నల్లమడ వాగు జిల్లాలో అతిపెద్ద మురుగు కాల్వ. వాగు గరిష్ఠ వరద నీటి ప్రవాహ సామర్థ్యం 24 వేల క్యూసెక్కులు. 2013లో కురిసిన భారీ వర్షాలకు వదర నీటితో పోటెత్తింది. అప్పట్లో ప్రవాహ ఉద్ధృతికి కట్టలు దెబ్బతిని 120కు పైగా గండ్లు పడ్డాయి. పంటలకు అపారనష్టం వాటిల్లింది. సమీపంలోని గ్రామాలు సైతం జల దిగ్బంధంలో చిక్కుకొన్నాయి. 2016 సెప్టెంబరులో వచ్చిన వరదలకూ ఇదే పరిస్థితి ఎదురైంది.

ఆధునికీకరణ పనులు రద్దు

గండ్లు పడి బలహీనంగా ఉన్న కట్టలపై అధికారులు తాత్కాలికంగా ఇసుక బస్తాలు వేయించారు. గత ప్రభుత్వ హయాంలో రూ.4.50 కోట్లు ఖర్చు చేసి కొంత మేర కట్టలు పటిష్ఠపరిచారు. వాగు ఆధునికీకరణకు రూ.360 కోట్లు కేటాయించారు. సర్వే పూర్తి చేసి భూసేకరణ ప్రతిపాదనలు రూపొందించి కలెక్టరేట్‌లో అందజేశారు. వైకాపా ప్రభుత్వం వచ్చాక ఏడాది క్రితం ఆధునికీకరణ పనులు రద్దు చేసింది. ప్రస్తుతం వర్షాకాలం కావడంతో నీరు అధికంగా వస్తే కట్టలు తెగిపోయి, గ్రామాలు మునిగిపోయే ప్రమాదం ఉందని గ్రామస్థులు అంటున్నారు.

అక్రమ తవ్వకాలపై చర్యలు తీసుకుని, వాగు కట్టలకు మరమ్మత్తులు చేయించాలని రైతులు కోరుతున్నారు. కలెక్టర్ ఈ విషయంపై స్పందించి మట్టి మాఫియాను అడ్డుకోవాలని నల్లమడ రైతు సంఘం నాయకులు డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి : ఏమైందీ.. ఎమ్మెల్యేకు..? ఒకవైపు ప్రమాదం.. మరోవైపు పొగ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.