గుంటూరు మార్కెట్ సెంటర్లో కమిషనర్ చల్లా అనురాధ... స్వయంగా చీపురు పట్టి, అధికారులతో కలిసి రోడ్డును శుభ్రం చేశారు. మార్కెట్లో వర్తకులతో మాట్లాడారు. ప్రతి దుకాణం ముందు తప్పనిసరిగా డస్ట్బిన్లు ఏర్పాటు చేసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.
లేకుంటే భారీ అపరాధ రుసుం విధిస్తామని హెచ్చరించారు. నగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయం ఎదురు ఉన్న ఆక్రమణలను వెంటనే తొలగించాలన్నారు. మార్కెట్లో నిషేధిత క్యారీ బ్యాగులు వినియోగిస్తే చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రణాళిక, ప్రజారోగ్య అధికారులను ఆదేశించారు.
ఇవీ చదవండి:
కుటుంబంలో స్వల్ప వివాదం..మనస్తాపంతో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య