గణతంత్ర దినోత్సవం సందర్భంగా గుంటూరుకు చెందిన ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు పావులూరి శివరామకృష్ణయ్యను జిల్లా యంత్రాంగం సన్మానించింది. ఎస్వీఎన్ కాలనీలోని ఆయన నివాసానికి వెళ్లిన కలెక్టర్ శామ్యూల్ ఆనంద కుమార్.. శాలువా కప్పి పావులూరిని సత్కరించారు.
స్వాతంత్య్ర సంగ్రామంలో పావులూరి పాత్రను కొనియాడారు. స్వాతంత్య్ర సమయంలోని ఘట్టాలను.. జిల్లాలో అలనాటి పరిస్థితులను శివరామకృష్ణయ్య కలెక్టర్కు వివరించారు.
ఇదీ చదవండి: గుంటూరు గణతంత్ర వేడుకల్లో అపశ్రుతి.. స్పృహ తప్పిన 101 ఏళ్ల వృద్ధుడు