తెదేపా నేతలపై గుంటూరు అరండల్‌పేట పోలీసులు కేసులు నమోదు చేశారు. నిన్న మంత్రి సీదిరి అప్పలరాజుపై తెదేపా నేతలు ఫిర్యాదు చేశారు. కరోనా నిబంధనలు ఉల్లంఘించి గుంపుగా స్టేషన్‌కు వచ్చారని తెనాలి శ్రావణ్ కుమార్, కోవెలమూడి రవీంద్ర సహా ఇతరులపై కేసు నమోదు చేశారు. 188, 269 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు అరండల్‌పేట పోలీసులు తెలిపారు. మంత్రి సీదిరి అప్పలరాజుపై మాత్రం కేసు నమోదు చేయలేదు.
ఇదీ చదవండి:
మంత్రి సీదిరి అప్పలరాజుపై పోలీస్ స్టేషన్లో తెదేపా నేతలు ఫిర్యాదు