గుంటూరులో కాలువలపైన ఆక్రమణలను యుద్ద ప్రతిపాదికన తొలగించాలని మున్సిపల్ కమిషనర్ చల్లా అనురాధ అధికారులను ఆదేశించారు. అమరావతి రోడ్డు, బాలాజీ నగర్, పాండురంగ నగర్, ప్రాంతాలలో పర్యటించిన కమిషనర్.. పారిశుద్ధ్య అభివృద్ది పనులను పరిశీలించారు.
లోతట్టు ప్రాంతాల్లో అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండి వర్షపు నీరు రోడ్లపై నిలబడకుండా చర్యలు చేపట్టాలన్నారు. ఖాళీ స్థలాల యాజమానులను గుర్తించి స్థలాలను శుభ్రం చేసుకోవడానికి నోటీసులు జారీ చేయాలని తెలిపారు. స్పందించని వారి స్థలాల్లో జీఎంసీ సిబ్బందే శుభ్రం చేసి క్లస్టర్ కంపోస్ట్ యూనిట్లు పెట్టాలని సూచించారు.
ఇదీ చదవండి: