గుంటూరులోని పలు హోటళ్లపై ఆహార భద్రత శాఖ, పురపాలక శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. బ్రాడీపేట మూడోలైనులో ట్రేడ్ లైసెన్సు లేకుండా నిర్వహిస్తున్న హోటల్‌ను అధికారులు సీజ్ చేశారు. బ్రాడీపేటలో నాలుగో లైనులో ఓ హోటల్లో పాడైన 6 కిలోల చికెన్‌ను స్వాధీనం చేసుకున్నారు. మరో హోటల్లో నిల్వ ఉన్న చికెన్ పదార్థాలను స్వాధీనం చేసుకున్న అధికారులు.. వీటిపై కేసులు నమోదు చేశారు.
అరండల్‌పేట 6వ లైనులో అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న మరో హోటల్‌ను అధికారులు సీజ్ చేశారు. ఆహార భద్రత ప్రమాణాల శాఖ డిప్యూటీ కంట్రోలర్ షేక్ గౌస్ మొహిద్దీన్ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. పాడైన, కల్తీ ఆహార పదార్థాలను విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని.. నగరంలో నిరంతరం నిఘాను ఏర్పాటు చేశామని ఆయన హెచ్చరించారు.
ఇదీ చదవండి: