ETV Bharat / city

Urea Problems: యూరియా కోసం రైతుల ఆవేదన.. గంటలకొద్దీ పడిగాపులు - డెల్టా లెటెస్ట్​ న్యూస్​

Farmers for urea : ప్రకృతి కోపానికి ఓసారి.. ధరల పతనానికి మరోసారి... చీడపీడల బెడదకు ఒకసారి.. సరైన దిగుబడి రాక ఇంకోసారి... ఇలా ప్రతిసారి పుడమితల్లిని నమ్ముకున్న అన్నదాతలకు అడుగడుగునా కష్టాలు తప్పడం లేదు.. వీటన్నింటినీ తట్టుకుని అప్పులు చేసి మరీ పంటలు సాగు చేస్తున్న రైతన్నలకు ఎరువుల కొరత మరోరూపంలో వేధిస్తోంది.. తరాలు మారినా.. ప్రభుత్వాలు మారినా తమ తలరాత మారడం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు.

Farmers Waiting for urea
యూరియా కోసం క్యూలేన్లలో రైతులు
author img

By

Published : Feb 11, 2022, 1:28 PM IST

Updated : Feb 11, 2022, 1:35 PM IST

యూరియా కోసం రైతుల ఆందోళన

Farmers for urea : గుంటూరు జిల్లాలోని డెల్టా ప్రాంతంలో మొక్కజొన్న రైతులను.. యూరియా కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. యూరియా కోసం రైతులు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు రైతు భరోసా కేంద్రాలు, సొసైటీల వద్ద పడిగాపులు కాస్తున్నారు. గంటలకొద్దీ క్యూలైన్లలో వేచి చూడాల్సి వస్తోందని వృద్ధులు, మహిళలు వాపోతున్నారు. ఆధార్ కార్డుపై ఎకరాకు కేవలం రెండు బస్తాలే ఇస్తున్న అధికారులు.. దానికీ లిక్విడ్‌ యూరియా కొనాలని లింకు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రికమండేషన్ ఉన్నవారికి ఎక్కువ మొత్తంలో యూరియాను తరలిస్తున్నారని కౌలు రైతులు ఆరోపిస్తున్నారు.

లిక్విడ్ యూరియా కొనుగోలు చేస్తేనే...

Farmers for urea : లిక్విడ్ యూరియాను కొనుగోలు చేస్తేనే రెండు బస్తాల యూరియా ఇస్తామనే రీతిలో అధికారులు వ్యవహరిస్తున్నారని అక్కడికి వచ్చిన రైతులు ఆందోళన చెందుతున్నారు. లిక్విడ్ యూరియా కేవలం మొక్క తొలిదశలో ఉన్నప్పుడు మాత్రమే ఉపయోగపడుతుందనీ.. మొక్క ఎదిగిన తర్వాత ఏ మాత్రం ఉపయోగం ఉండదని వాపోతున్నారు. లిక్విడ్ ధర రూ.240 వెచ్చించి తీసుకున్న ఉపయోగపడని దాన్ని ఏం చేసుకోవాలో తెలియని పరిస్థితి ఏర్పడుతుందని వాపోతున్నారు.

సకాలంలో మొక్కకు యూరియా అందకపోతే...

Farmers for urea : బయట మార్కెట్​లో యూరియా కట్ట ధర రూ.350 ఉందని పేర్కొన్న రైతులు.. ఉపయోగపడని లిక్విడ్​కు రూ.240 వెచ్చించి కొనుగోలు చేసే కంటే..బయట మార్కెట్​లో కొనుగోలు చేయడమే మేలు అనే విధంగా ఉందని మహిళా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సకాలంలో మొక్కకు యూరియా అందకపోతే మొక్క బలహీనపడి మెరుగైన దిగుబడి రాదని రైతులు ఆవేదన చెందుతున్నారు. రైతు భరోసా కేంద్రాలు పెట్టారేగాని తమకు ఏ మాత్రం ఉపయోగపడటం లేదని స్పష్టం చేస్తున్నారు. త్వరితగతిన ప్రభుత్వం స్పందించి తమకు కావలసిన నత్రజని రూపంలో ఉన్న యూరియాను అందించాలని రైతు, కౌలు రైతులు ఆకాంక్షిస్తున్నారు.

ఇదీ చదవండి:

Illegal Mining: 'సుద్దపల్లి క్వారీల్లో అక్రమ తవ్వకాలు నిజమే.. అయితే'

Last Updated : Feb 11, 2022, 1:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.