Farmers union leaders: కార్పొరేట్ శక్తులకు కొమ్ము కాస్తూ ప్రజలు, రైతులకు ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి జగన్ తుంగలో తొక్కారని రైతు సంఘం నాయకులు ఆరోపించారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో యూ1 జోన్ ఎత్తివేయాలని గత ఏడు రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్న రైతులకు.. ఏపీ రైతు సంఘం నాయకులు మద్దతు ప్రకటించారు. భూములు కోల్పోతున్న రైతులతో కలిసి నినాదాలు చేశారు. యూ1 జోన్ ఎత్తేస్తామని అధికారంలోకి వచ్చినా శాసనసభ్యులు ఆళ్ల రామకృష్ణారెడ్డి రైతులను మోసం చేశారని రైతు సంఘం నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి జోన్ ఎత్తేయలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రైతులకు మద్దతుగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
ఇదీ చదవండి: Nadendla Manohar: 'మంత్రులపై సీఎంకు నమ్మకం లేదనడానికి రాజీనామాలు చేయించిన తీరే నిదర్శనం'
"కార్పొరేట్ శక్తుల కొమ్ము కాస్తూ... ప్రజలకు ఇచ్చిన హామీలు తుంగలో తొక్కారు" - గుంటూరు జిల్లా లేటెస్ట్ అప్డేట్స్
Farmers union leaders: కార్పొరేట్ శక్తులకు కొమ్ము కాస్తూ ప్రజలకు ఇచ్చిన హామీలను జగన్ తుంగలో తొక్కారని రైతు సంఘం నాయకులు ఆరోపించారు. యూ1 జోన్ ఎత్తివేయాలని గత ఏడు రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్న రైతులకు మద్దతు ప్రకటించారు. తక్షణమే స్పందించి జోన్ ఎత్తేయలని డిమాండ్ చేశారు.