ETV Bharat / city

తెలుగు మహిళా విభాగం ఆధ్వర్యంలో ఈటీవీ 25వ వార్షికోత్సవం

అనంతపురం జిల్లా తెలుగు మహిళా విభాగం ఆధ్వర్యంలో ఈటీవీ 25వ వార్షికోత్సవం సందర్భంగా కేక్ కట్ చేశారు. పాతికేళ్లుగా బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్న ఈటీవీకి జిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాలు మదమంచి స్వరూప శుభాకాంక్షలు తెలిపారు. ఈటీవీ మరెన్నో మైలురాళ్లు చేరుకోవాలని ఆకాంక్షించారు.

ETV 25th Anniversary Celebrations under the auspices of Telugu Women Section
తెలుగు మహిళా విభాగం ఆధ్వర్యంలో ఈటీవీ 25వ వార్షికోత్సవం వేడుకలు
author img

By

Published : Aug 27, 2020, 10:55 PM IST

Updated : Aug 28, 2020, 12:03 PM IST

ఈటీవీ 25వ వార్షికోత్సవం సందర్భంగా అనంతపురం నగర మాజీమేయర్, జిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాలు మదమంచి స్వరూప శుభాకాంక్షలు తెలిపారు. దక్షిణాదిన తొలి శాటిలైట్‌ ఛానల్‌ ఈటీవీ 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా జిల్లా తెలుగు మహిళా విభాగం ఆధ్వర్యంలో ఆమె తన నివాసంలో కేకే కట్ చేసి సిల్వర్​జూబ్లీలోకి అడుగుపెట్టిన ఈటీవీకి శుభాభినందనలు తెలిపారు. 'ఈటీవీ ఇది మన టీవీ' అనిపించేలా పాతికేళ్లుగా బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తూ వస్తోందన్నారు.

వార్తలు, సినిమాలు, ధారావాహికలు, కామెడీ షోలతో ఇన్నేళ్ల ఈ ప్రస్థానంలో ఎప్పుడూ మొదటి, రెండు స్థానాల్లోనే ఈటీవీ కొనసాగుతూ వచ్చిందని కొనియాడారు. నంది అవార్డులతో పాటు అనేక ప్రతిష్ఠాత్మక అవార్డులను ఈటీవీ అందుకుందని గుర్తుచేశారు. మరెన్నో మైలురాళ్లు చేరుకోవాలని ఆకాంక్షించారు. ఈనాడు, ఈటీవీ అధినేత రామోజీరావుకు, ఈటీవీ సిబ్బందికి తెలుగు మహిళలు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా తెలుగు మహిళ ప్రచార కార్యదర్శి సరిత, అశ్విని, రామలక్ష్మి, శాంతమ్మ తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:

రామోజీ ఫిల్మ్‌ సిటీలో వైభవంగా ఈటీవీ రజతోత్సవం

Last Updated : Aug 28, 2020, 12:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.