ETV Bharat / city

Election campaign: దగ్గరపడ్డ గడువు.. హోరాహోరీగా పార్టీ నేతల ప్రచారం - elections in dachepalli

గుంటూరు జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారానికి(election campaign in guntur district) నేటితో తెరపడనుంది. ప్రచారానికి చివరి రోజు కావడంతో తెదేపా, వైకాపా, జనసేన అభ్యర్థులు పోటాపోటీగా ఓట్లు అభ్యర్థించారు. అభ్యర్థులకు మద్దుతుగా పార్టీ నాయకులు పాల్గొని కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు.

గుంటూరు జిల్లాలో ఎన్నికల ప్రచారం
గుంటూరు జిల్లాలో ఎన్నికల ప్రచారం
author img

By

Published : Nov 13, 2021, 3:29 PM IST

గుంటూరు నగరపాలక సంస్థ ఆరో డివిజన్(election in guntur corporation sixth ward) తెదేపా అభ్యర్థి(TDP candidate)కి మద్దతుగా... ఆ పార్టీ నాయకులు ప్రచారం చేశారు. నగరంలో సమస్యలు విలయతాండవం చేస్తున్నాయని, ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని సూచించారు. పోలీసులను అడ్డం పెట్టుకుని వైకాపా నేతలు అక్రమాలకు(YCP leaders) పాల్పడుతున్నారని ఆరోపించారు. సీఎం జగన్ ఇచ్చిన హామీలు అన్నీ అమలవుతున్నాయని, నగర అభివృద్ధికి తమ పార్టీ అభ్యర్థికి ఓటు వేయాలని వైకాపా ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు ప్రచారం చేశారు. ఎన్నికల ప్రచారంతో ఆరో డివిజన్​లో సందడి నెలకొంది. అధికార, ప్రతిపక్ష పార్టీ నేతల విమర్శలు, ప్రతివిమర్శలతో రాజకీయ వేడి మొదలైంది.

ఎన్నికల నేపథ్యంలో దాచేపల్లి నగర పంచాయతీ(dachepalli) కార్యాలయాన్ని గురజాల ఆర్​డీఓ పార్థసారథి(gurajala RDO parthasaradhi) సందర్శించారు. ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించారు. దాచేపల్లి, గురజాలలోని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను ఇప్పటికే గుర్తించామని, ఆయా కేంద్రాల్లో భద్రతా ఏర్పాట్లు చేశామని పార్థసారధి తెలిపారు.

హైకోర్టు ఆదేశాలతో పటిష్ఠ భద్రత...

గురజాల, దాచేపల్లి నగర పంచాయతీ ఎన్నికలు నిష్పాక్షికంగా జరిగేందుకు తగిన పోలీసు భద్రత కల్పించేలా చర్యలు తీసుకోవాలని పోలీసులను, ఎస్ఈసీ కార్యదర్శిని(SEC secretary) హైకోర్టు(jogj court) ఆదేశించింది. ప్రతివాదులకు నోటీసులు జారీచేసింది. విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డి. రమేశ్ ఈమేరకు ఆదేశాలు జారీచేశారు. గురజాల, దాచేపల్లి నగర పంచాయతీ పరిధిలో ఎన్నికలు సజావుగా జరిగేలా, పోలీసు భద్రత కల్పించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ పి.వరలక్ష్మి, బి.కృపారావు మరికొందురు హైకోర్టులో అత్యవసరంగా రెండు వ్యాజ్యాలు దాఖలు చేశారు. న్యాయవాది నర్రా శ్రీనివాసరావు వాదనలు వినిపించారు. అధికారపార్టీ నేతలు పిటిషనర్లను నామినేషన్లను ఉపసంహరించుకోవాలని బెదిరిస్తున్నారన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసు భద్రత కల్పించాలన్నారు. ఎన్నికల నిర్వహణ తీరును టెలికాస్ట్ చేయాలని కోరారు. ఆ వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి .. సంబంధిత పోలీసులు, ఎస్ఈసీ కార్యదర్శికి ఈనెల 12 లోపు వినతి ఇవ్వాలని పిటిషనర్లను ఆదేశించారు. ఆ వినతిని పరిగణనలోకి తీసుకొని నిష్పాక్షిక, స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నిలకు జరిగేందుకు తగిన భద్రత కల్పించాలని పోలీసులు, ఎస్ఈసీని ఆదేశించారు.

ఇవీచదవండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.