పదో తరగతిలో ఉత్తమ ప్రతిభ చూపే విద్యార్థులకు ఇచ్చే అబ్దుల్ కలామ్ ప్రతిభా పురస్కారం పేరు మారింది. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలామ్ ప్రతిభా పురస్కారం పేరును వైఎస్ఆర్ విద్యా పురస్కారంగా మార్చుతూ పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బి. రాజశేఖర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటినుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తమ ప్రతిభ చూపే పదో తరగతి విద్యార్థులకు మాత్రమే ఈ పురస్కారాలను ఇవ్వనున్నారు. ఇంతకుముందు ప్రైవేటు పాఠశాల విద్యార్థులకూ ఇచ్చేవారు. ఈ నెల మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ జయంతి రోజున విద్యార్థులకు ఈ ప్రతిభా పురస్కారాలను అందించనున్నారు. ఇప్పటివరకు రాష్ట్ర స్థాయిలో ఈ కార్యక్రమం నిర్వహించగా.. ఈ ఏడాది జిల్లాల వారీగా నిర్వహించనున్నారు.
ఇదీ చూడండి