ETV Bharat / city

Diamond Jubilee: ఆ పాఠశాలకు అరవై ఏళ్లు... ఘనంగా వజ్రోత్సవం

Diamond Jubilee: పాఠశాల... పిల్లలకు చదువు నేర్పే స్థలం... అంతే కాదు... విద్యార్థిని సమగ్రంగా తీర్చిదిద్దే దేవాలయం... మంచి పౌరుడిగా సమాజానికి అందించే శిక్షణాకేంద్రం... అలాంటి పాఠశాలల్లో ఆ బడి ముందు వరుసలో నిలుస్తోంది... ఈ చదువులమ్మ చెట్టు నీడలో వేల మంది విద్య నేర్చుకుని దేశ, విదేశాల్లో ఉన్నత స్థానాలు అధిరోహించారు. 60 ఏళ్లు పూర్తిచేసుకున్న విద్యాలయం ఇప్పుడు వజ్రోత్సవాన్ని జరుపుకొంటోంది. ఇంతకీ అది ఏ పాఠాశాలో తెలుసుకుందామా...

Diamond Jubilee at Patibandla Sitaramaiah High School
పాటిబండ్ల సీతారామయ్య పాఠశాల వజ్రోత్సవాలు
author img

By

Published : Mar 1, 2022, 3:39 PM IST

Diamond Jubilee: సమాజం నుంచి మనం తీసుకోవడమే కాదు... సమాజానికి ఎంతో కొంత తిరిగివ్వాలనే లక్ష్యంతో 60 ఏళ్ల క్రితం ఏర్పాటైంది గుంటూరులోని పాటిబండ్ల సీతారామయ్య పాఠశాల. సామాజిక బాధ్యతతో ఏర్పడిన ఈ ప్రతిష్టాత్మక పాఠశాల తొలినాళ్లలో ఎన్నో ఇబ్బందులు అధిగమించి అస్థిత్వాన్ని నిలుపుకుని ప్రత్యేకత సాధించింది. విద్యార్థి సమగ్ర వికాసానికి అనువైన వాతావరణం, విద్యాభిలాష కలిగించేలా తరగతులు ఈ పాఠశాల సొంతం. విశాలమైన క్రీడామైదానం, ఇండోర్ గేమ్స్ సౌకర్యాలు పాటిబండ్ల సీతారామయ్య పాఠశాలను మిగిలిన పాఠశాలల కంటే భిన్నంగా నిలుపుతున్నాయి.

పాటిబండ్ల సీతారామయ్య పాఠశాల వజ్రోత్సవాలు

Diamond Jubilee: 60 ఏళ్లలో వేల మంది విద్యార్థులు ఇక్కడ విద్య అభ్యసించారు. ఇక్కడ వేసుకున్న జ్ఞాన పునాదులతో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ చాటారు. ఉన్నత స్థానాలను అధిరోహించారు. ప్రస్తుత నాబార్డు ఛైర్మన్ చింతల గోవిందరాజులు, ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు, కశ్మీర్ డీజీగా పనిచేస్తున్న గూడూరు శ్రీనివాస్, అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ వైద్యబృందంలో సభ్యుడిగా పనిచేసిన కార్డియాలజిస్టు డాక్టర్ శివకుమార్, కృష్ణపట్నం పోర్ట్ ఎండీ కర్నాటి వెంకటేశ్వరరావు, మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ఇక్కడ చదువుకున్నవారే. వీరితోపాటు.. ఇంకెందరో ఇక్కడ చదువుకుని ఐఏఎస్, ఐపీఎస్ అధికారులయ్యారు. మరికొందరు వైద్యులు, ఇంజనీర్లుగా దేశ, విదేశాల్లో పేరు తెచ్చుకున్నారు.

"ఏ ఆశయంతో ఈ పాఠశాల స్థాపించారో 60 ఏళ్ల తర్వాత అదే స్ఫూర్తితో కొనసాగుతోంది. మార్కులే పరమావధిగా ప్రస్తుత విద్యావిధానం కొనసాగుతున్న తరుణంలో.. విద్యార్థుల సృజనాత్మక శక్తిని వెలికితీసేందుకు అనుగుణంగా ఈ పాఠశాల కార్యాచరణ ఉంటోంది. చదువుతోపాటు క్రమశిక్షణ, నైతిక విలువలు ఈ పాఠశాల ప్రత్యేకతను సజీవంగా ఉంచుతున్నాయి."-విశ్రాంత ఉపాధ్యాయులు, పాఠశాల నిర్వాహకులు.

చదువును కొనుక్కోవాల్సి వస్తున్న ఈ రోజుల్లో సేవాభావంతో, సామాజిక బాధ్యతతో 60 ఏళ్లుగా కొనసాగుతున్న పాటిబండ్ల సీతారామయ్య లాంటి పాఠశాలలు స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయి.

ఇదీ చదవండి: కోటొక్క ప్రభ కడితే కోటయ్య కొండ దిగి వస్తాడట.. అదే వారి నమ్మకమట..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.