గుంటూరు జిల్లా తీర ప్రాంతంలో ఇసుక అక్రమ తవ్వకాలతో కొంత మంది రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కర్లపాలెం మండలం చింతాయ పాలెం పంచాయతీ పరిధిలోని పంట భూములులో ఇటీవల కొందరు అక్రమంగా మట్టి తవ్వకాలు చేపట్టారు. తవ్వకాల వల్ల పొలాల్లో గుంతలు పడిపోయాయి. దీని వలన పక్కనే ఉన్న పంట పొలాలకు మెరక అవ్వడం వలన నీరు నిలబడక తవ్వకాలు జరిపిన పొలాల్లోకి నీరు నిల్వ ఉంటోంది.
పంట సాగుకు విత్తనాలు వేసుకున్న రైతులకు నీరు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తవ్వకాలు జరుగుతున్న సమయంలో అధికారులకు చెప్పినా పట్టించుకోలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి: కత్తితో దాడి.. పోలీసుల అదుపులో ముగ్గురు యువకులు