గుంటూరు జిల్లా దాచేపల్లి పోలీసులు వృత్తి ధర్మంతో పాటు మానవత్వం చాటుకున్నారు. రామాపురంలో నివాసం ఉండే ఓ వృద్ధురాలు..తనను కొడుకులు పట్టించుకోవడం లేదని విరక్తి చెందింది. ఇలాంటి పరిస్థితిలో ఏం చేయాలో దిక్కుతోచక.. దగ్గరలో ఉన్న బావిలోకి (An old lady Jumped in well and tried to commit suicide) దూకింది. బామ్మ చేసిన పనిని గమనించిన స్థానికులు దాచేపల్లి పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న ఎస్సై సుధీర్, తన సిబ్బందితో కలిసి బావిలోకి దిగి వృద్ధురాలిని(Dachepalli police saved old lady) కాపాడారు.
వృద్ధురాలి చేయి విరగడంతో దగ్గరలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో అక్కడ నుంచి108 సిబ్బందితో మెరుగైన వైద్యం కోసం గుంటూరుకు తరలించారు. సకాలంలో స్పందించి ప్రాణాన్ని కాపాడిన పోలీసులను గ్రామస్థులు చప్పట్లతో(Villagers appreciated police) అభినందించారు.
"బాటిళ్లన్నీ అమ్మారా.. ఏమైనా మింగేశారా?" మద్యం దుకాణాల్లో సర్కారు ఆడిట్..!