రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌ను కొనసాగించాలని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించటాన్ని స్వాగతిస్తున్నామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. హైకోర్టు తీర్పు ప్రకారం ఎస్‌ఈసీగా నిమ్మగడ్డను నియమించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి గవర్నర్ లేఖ పంపారన్నారు. హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం పలుమార్లు కోరినా సుప్రీంకోర్టు నిరాకరించిందన్నారు. సుప్రీంకోర్టు స్టే ఇవ్వడానికి మూడు సార్లు నిరాకరించినా రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు తీర్పును అమలు చేయకుండా కోర్టు ధిక్కరణకు పాల్పడుతోందనన్నారు.
వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వ్యవస్థలను విధ్వంసం చేస్తున్నారని ఆరోపించారు. కోర్టు ఆదేశాలను కూడా లెక్క చేయకుండా వైకాపా ప్రభుత్వం వ్యవహరిస్తుందన్నారు. తక్షణమే సీఎం జగన్... గవర్నర్ ఆదేశాలును అమలు చేయాలని కోరారు.
ఇదీ చదవండి: ఎస్‌ఈసీగా నిమ్మగడ్డను నియమించాలంటూ సీఎస్‌కు గవర్నర్ ఆదేశం