గుంటూరు విద్యుత్ భవన్లోని ఉద్యోగులకు కరోనా పరీక్షలు నిర్వహించారు. కరోనా కేసులు అధికమవుతున్న నేపథ్యంలో ఉద్యోగులకు పరీక్షలు నిర్వహించారు. మార్చి నెలాఖరు నుంచి 50శాతం ఉద్యోగులే విధులకు హాజరు అయ్యే విధంగా చర్యలు తీసుకున్నామని ఎస్‌ఈ ఎం.విజయకుమార్ అన్నారు. ప్రాంగణం మొత్తం ఎప్పటికప్పుడు క్రిమి సంహారక ద్రావణం పిచికారి చేస్తున్నట్లు తెలిపారు. ఉద్యోగులకు మాస్క్ లు, సానిటైజర్లు, ఫేస్ షీల్డ్ లు ఇప్పటికే అందించామన్నారు. రీడింగులు, బిల్లుల వసూళ్ల క్రమంలో అన్ని జాగ్రత్తలు పాటిస్తున్నామన్నారు.
ఇదీ చదవండి: రాష్ట్రంలో కొత్తగా 1,178 కరోనా కేసులు..13 మంది మృతి