గుంటూరు ఐడీ ఆస్పత్రిలో కరోనా లక్షణాలతో ప్రకాశం జిల్లాకు చెందిన ఓ వృద్ధుడు చేరాడు. ఇటీవలే హైదరాబాద్ నుంచి వచ్చిన అతను... తీవ్రమైన జ్వరం, దగ్గు, జలుబుతో బాధపడుతున్నాడు. కరోనా అనుమానంతో అతని గొంతు నుంచి నమూనాలు సేకరించి తిరుపతికి పంపినట్లు ఐడీ ఆసుపత్రి వైద్యాధికారులు తెలిపారు. అతని పరిస్థితి కొంచెం విషమంగా ఉన్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం వృద్ధుడికి చికిత్స అందిస్తున్నామని... నివేదిక ఆధారంగా తదుపరి వైద్యం ఉంటుందని వివరించారు. ఇప్పటి వరకూ జిల్లాలో ఐదు కరోనా అనుమానిత కేసులు రాగా... నలుగురికి నెగిటివ్ వచ్చింది. మరొకరి నివేదిక రావాల్సి ఉంది. మరోవైపు ప్రకాశం జిల్లాలో కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తి... గత ఆదివారం గుంటూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి వచ్చినట్లు తేలటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఆ ఆసుపత్రి వైద్యులను, సిబ్బందిని ఐసోలేషన్లోకి వెళ్లాలని సూచించారు.
ఇవీ చదవండి: