ETV Bharat / city

కరోనా సోకిందని తీసుకెళ్లారు... ఓ టాబ్లెట్ ఇచ్చి ఇంటికి పంపేశారు..! - గుంటూరు కరోనా కేసులు

కరోనా వచ్చిందని ఓ మహిళను గుంటూరుకు తరలించారు అధికారులు. కానీ జీజీహెచ్ వైద్యులు...ఆ మహిళకు ఓ టాబ్లెట్ ఇచ్చి ఇంటికి పంపేశారు. అనారోగ్యంతో ఉన్న ఆమె నరసరావుపేటకు చేరుకుని బంధువులకు ఫోను చేసింది. దీంతో మహిళ బంధువులు ఆందోళనకు గురయ్యారు. కరోనా ఉందని తీసుకెళ్లి... ఇలా నిర్లక్ష్యంగా వదిలేయడమేంటని ప్రశ్నించారు.

కరోనా సోకిందని తీసుకెళ్లారు... ఓ టాబ్లెట్ ఇచ్చి ఇంటికి  పంపేశారు..!

author img

By

Published : Jul 18, 2020, 12:20 PM IST

కరోనా పాజిటివ్ వచ్చిందని ఓ మహిళను తీసుకెళ్లి... ఒక టాబ్లెట్ ఇచ్చి ఇంటికి పంపేసిన వైనం గుంటూరు జిల్లాలో వెలుగుచూసింది. ఎవరు తోడులేకుండా ఇంటికి పంపడంపై బాధిత మహిళ కుమార్తె ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా నరసరావుపేటకు చెందిన ఒక మహిళకు కరోనా సోకిందని శుక్రవారం.. అధికారులు గుంటూరుకు తరలించారు. అయితే బాధిత మహిళ ఇవాళ ఉదయం బంధువులకు ఫోను చేసి తాను నరసరావుపేట మల్లమ్మ సెంటరులో ఉన్నానని చెప్పడంతో బంధువులు ఆందోళన చెందారు.

ఓ మహిళను ఆరోగ్యం బాగోలేకపోతే... స్థానిక ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు. ఆమెకు కరోనా పరీక్షలు నిర్వహించారు. ఆమెకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యిందని ఫోన్​కు సమాచారం వచ్చింది. అధికారులు ఆమెను ముందుగా చిలకలూరిపేట సమీపంలోని కొండ్రపాడుకు తరలించారు. తర్వాత గుంటూరు జీజీహెచ్​కు తీసుకెళ్లారు.

జీజీహెచ్ వైద్యులు మహిళకు ఒక టాబ్లెట్ ఇచ్చి ఇంటికి పంపించేశారని బాధిత మహిళ బంధువులు తెలిపారు. దీంతో ఆమె గుంటూరు నుంచి ఆటోలో నరసరావుపేట చేరుకుందన్నారు. స్థానిక అధికారులకు సంచారమిచ్చినా...ఎవ్వరూ రాలేదన్నారు. చివరకు 108 వాహనంలో మహిళను స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించామని చెప్పారు.

ఇదీ చదవండి : మద్యం కోసం మహిళలు క్యూ.. దీని వెనక ఓ కథ ఉందండోయ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.