గుంటూరు ప్రభుత్వ జ్వరాల వైద్యశాలలో చికిత్స పొందుతూ ఈనెల 7న ఓ వ్యక్తి మరణించాడు. ఆ వ్యక్తికి కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ అవటంతో మృతదేహాన్ని మార్చురీలో భద్రపరిచారు. ఆసుపత్రిలో ఉన్న వివరాల ఆధారంగా నరసరావుపేటలోని మృతుడి బంధువులకు సమాచారం అందజేసినా ఎవరూ రాలేదని వైద్యులు తెలిపారు. వారంతా క్వారంటైన్‌లో ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారుల సూచనలు, నిబంధనలు పాటించి.. భౌతికకాయాన్ని శుక్రవారం స్థానిక స్తంభాలగర్వులో శ్మశానవాటికకు తరలించి అంత్యక్రియలు పూర్తిచేసినట్లు వెల్లడించారు.
అనాథగా అంతిమయాత్ర..! - కరోనాతో మృతి చెందిన నరసారావుపేట వ్యక్తి
కరోనా మహమ్మారి అనుబంధాలను దూరం చేసింది. కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తి మరణిస్తే మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు ఎవరూ రాని దుస్థితిని తీసుకొచ్చింది. కుటుంబ సభ్యులు, బంధువులు ఉన్నప్పటికీ కడసారి చూపులకు నోచుకోలేని స్థితిలో చివరికి ఆసుపత్రి సిబ్బంది, నగరపాలక సంస్థ ఉద్యోగులే అంత్యక్రియలు నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ ఘటన గుంటూరులో జరిగింది.
గుంటూరు ప్రభుత్వ జ్వరాల వైద్యశాలలో చికిత్స పొందుతూ ఈనెల 7న ఓ వ్యక్తి మరణించాడు. ఆ వ్యక్తికి కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ అవటంతో మృతదేహాన్ని మార్చురీలో భద్రపరిచారు. ఆసుపత్రిలో ఉన్న వివరాల ఆధారంగా నరసరావుపేటలోని మృతుడి బంధువులకు సమాచారం అందజేసినా ఎవరూ రాలేదని వైద్యులు తెలిపారు. వారంతా క్వారంటైన్‌లో ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారుల సూచనలు, నిబంధనలు పాటించి.. భౌతికకాయాన్ని శుక్రవారం స్థానిక స్తంభాలగర్వులో శ్మశానవాటికకు తరలించి అంత్యక్రియలు పూర్తిచేసినట్లు వెల్లడించారు.
ఇదీ చూడండి: కరోనా ప్రభావం.. అపార్ట్‌మెంట్లలో అప్రమత్తం
TAGGED:
అనాథగా అంతిమయాత్ర