ETV Bharat / city

గుంటూరు జిల్లాలో 255 కరోనా పాజిటివ్​ కేసులు నమోదు - గుంటూరు జిల్లా తాజా వార్తలు

గుంటూరు జిల్లాపై కరోనా ప్రభావం పెరుగుతుంది. లాక్​డౌన్​ నుంచి ప్రభుత్వం వెసులుబాటు కల్పించడం వల్ల పట్టణాలతో పాటు గ్రామాలలో సైతం కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఆదివారం ఒక్క రోజే జిల్లాలో 255 కేసులు నమోదుకాగా... నగరపాలక సంస్థ పరిధిలో 114 కేసులు వచ్చాయి.

corona cases raised in guntur district and officers gets alerted
పెరగిన కేసులతో అధికారులు అప్రమత్తం
author img

By

Published : Jul 12, 2020, 7:29 PM IST

గుంటూరు జిల్లాలో ఆదివారం తాజాగా 255 కరోనా పాజిటివ్​ కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 3826కి చేరింది. గతంలో తూర్పు నియోజకవర్గానికే కేసులు పరిమితం కాగా... తాజాగా పశ్చిమ ప్రాంతాలకు విస్తరించింది. ఆదివారం ఒక్క రోజే నగరపాలక సంస్థ పరిధిలో 114 కేసులు నమోదయ్యాయి.

వినుకొండలో 31, తాడేపల్లిలో 12, యడ్లపాడులో 10, మంగళగిరిలో 9, దాచేపల్లిలో 7, తెనాలి, నరసరావుపేటలో 6, సత్తెనపల్లి, తుళ్లూరులో 5, చేబ్రోలు, భట్టిప్రోలు, చిలకలూరిపేటలో 4 కేసుల చొప్పున కేసులు నమోదయ్యాయి. వైరస్​ నియంత్రణకు జిల్లా కలెక్టర్​ శ్యామ్యూల్​ ఆనంద్​ కుమార్​ కొత్తగా 23 కంటైన్మెంట్​ జోన్లను ప్రకటించారు. బాధితుల కోసం 5 వేల బెడ్ల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రైవేటు ఆసుపత్రుల సేవలను వినియోగించుకుంటామని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి :

అనంతలో అలజడి.. ఒక్కరోజే 311 కరోనా కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.