ETV Bharat / city

NO WORK TO CONSTRUCTION LABOUR: ఏ పనైనా ఓకే.. ఉపాధి దొరక్క రోజువారీ కూలీల కష్టాలు! - sand issue in ap

NO WORK TO CONSTRUCTION LABOUR: ఇసుక దొరక్క రోజువారీ కూలీల బతుకు దుర్భరమైంది. పుండు మీద కారంలా... కరోనా మరిన్ని కష్టాల్లోకి నెట్టింది. ఉపాధి అవకాశాలు సన్నగిల్లాయి..! నిత్యావసరాల ధరలు కొండెక్కి కూర్చున్నాయి. పనుల్లేక, అరకొర సంపాదనతో కుటుంబాన్ని నెట్టుకురాలేక,.. గుంటూరు అడ్డాల్లో రాజువారీ కూలీలు అష్టకష్టాలు పడుతున్నారు.

పని కోసం పడిగాపులు.. ఉపాధి దొరక్క రోజువారీ కూలీల కష్టాలు

author img

By

Published : Jan 2, 2022, 9:32 AM IST

పని కోసం పడిగాపులు.. ఉపాధి దొరక్క రోజువారీ కూలీల కష్టాలు

NO WORK TO CONSTRUCTION LABOUR: రోజువారీ పనుల కోసం కూలీలు గుంటూరు నగరంలో రోజూ అనేక చోట్ల... ఉదయాన్నే నిరీక్షిస్తుంటారు. లాడ్జ్‌ సెంటర్‌, గాంధీ పార్కు, చుట్టగుంట ప్రాంతాల్లోని అడ్డాల్లో ఎదురుచూస్తూ కనిపిస్తారు. భవన నిర్మాణం, వ్యవసాయ, మట్టి పనులు..ఇలా దేనికోసం పిలిచినావెళ్లేందుకు సిద్ధంగా ఉంటారు. అలాంటి వారిని కదిలిస్తే కష్టాల చిట్టా విప్పుతున్నారు. కరోనాకు ముందు ఇసుక దొరక్క,.. భవన నిర్మాణ పనులు ఆగిపోయి... ఉపాధి కరవైంది. ప్రస్తుతం కొంత ఇసుక కొరత తీరినా... కూలీల సంఖ్యకు తగినట్లు పనులు జరగడంలేదు. ఫలితంగా ఎంతో మంది పనుల్లేక అల్లాడుతున్నారు.

గతంలో తీరిక లేకుండా గడిపిన కూలీలు ఇప్పుడు ఆశించిన స్థాయిలో భవన నిర్మాణ పనులు ఆశించిన స్థాయిలో పుంజుకోకపోవడం వల్ల.. ప్రస్తుతం ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. దీనికి తోడు పెరిగిన సిమెంట్‌, ఇసుక, ఉక్కు ధరలు భవన నిర్మాణ రంగంపై ప్రభావం చూపుతున్నాయి. మొదటి విడత లాక్‌డౌన్‌తో చేసిన అప్పులు ఇప్పటికీ తీరకపోగా.. రెండో విడత కరోనాతో మరింత కుదేలయ్యారు. కొందరికే పనులు దొరికినా కొద్దిపాటి ఆదాయంతోనే కాలం వెల్లదీయాల్సి వస్తోంది.

అసలే పనిదొరక్క అల్లాడుతుంటే.. నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటడం జీవనాన్ని దుర్భరంగా మార్చిందని భవన నిర్మాణ కార్మికులు అంటున్నారు. ఇలాంటి సమయంలో కార్మికుల సంక్షేమ బోర్డు నుంచి అమలు కావాల్సిన పథకాలు ఒక్కటీ అందడం లేదని ఆక్షేపిస్తున్నారు. ఇసుకను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెస్తే.. పరిస్థితి కొంత మెరుగవుతుందని భవన నిర్మాణ కార్మికులు కోరుతున్నారు.

ఇదీ చదవండి: CBN comments on early elections: రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల ప్రచారం.. ఎప్పుడైనా రెడీ : చంద్రబాబు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.