భాజపా యువమోర్చా నేతలకు ఓ సామాన్యుడు షాక్(BJP COLLECTING FLOOD FUND) ఇచ్చాడు. వరద భాదితులను ఆదుకోవడానికి గుంటూరు నగరంలో విరాళాలు సేకరిస్తున్న భాజపా శ్రేణులను అతడు ప్రశ్నించాడు.
నిధుల సేకరణలో భాగంగా ఓ దుకాణం వద్దకు వెళ్లారు భాజపా నేతలు. వారిపై సదరు దుకాణదారుడు ప్రశ్నల వర్షం(COMMON MAN QUESTIONS BJP LEADERS) కురిపించాడు. కేంద్రంలో భాజపానే అధికారంలో ఉండగా.. వరద బాధితుల కోసం ప్రజల నుంచి విరాళాలు సేకరించటమేంటని ప్రశ్నించాడు.
వరదలతో రాష్ట్రంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిసిన కేంద్రం.. ఆర్థిక సహాయం అందించవచ్చు కదా అని నిలదీశాడు. సామాన్యుడి ప్రశ్నకు భాజపా యువమోర్చా నాయకులు విస్తుపోయారు. వెంటనే వారు అక్కడ నుంచి వెనుదిరిగారు.
ఇదీ చదవండి:
TDP MUSLIM LEADERS: 'సైదాపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలి'