కవిత్వ పరామర్శ పుస్తక ఆవిష్కరణ, సీహెచ్ లక్ష్మీనారాయణ స్మారక సాహితీ పురస్కారం ప్రదానోత్సవ కార్యక్రమాన్ని గుంటూరు అరండల్పేటలోని ఓ హోటల్లో ఆదివారం ఘనంగా నిర్వహించారు. డాక్టర్ సీహెచ్ సుశీలమ్మ రచించిన 'కవిత్వ పరామర్శ' పుస్తకాన్ని సీఐడీ అడిషనల్ డీజీపీ సునీల్ కుమార్ ఆవిష్కరించారు.
డాక్టర్ సుశీలమ్మ గత 38 నెలలుగా సురక్ష అనే పోలీసుల పత్రికను రాస్తున్నారని రైల్వే డీజీపీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఆ పత్రికను నేడు పుస్తక రూపంలో ఆవిష్కరించామని అన్నారు. అలాగే తన తండ్రి సీహెచ్ లక్ష్మీనారాయణ స్మారక సాహితీ పురస్కారాన్ని సాహిత్య ప్రముఖుడు రామ్ మోహన్ రాయ్కి ప్రదానం చేస్తున్నామని తెలిపారు. వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించుకోవడానికి ఈ పుస్తకం ఎంతోగాను దోహదపడుతుందని సీఐడీ అడిషనల్ డీజీపీ సునీల్ కుమార్ అన్నారు.
ఇదీ చదవండి