ఎలాంటి దత్తత పత్రాలు లేకుండా... అక్రమంగా 17 రోజుల పసికందును తెచ్చిన మహిళను గుంటూరు పోలీసులు, చైల్డ్‌లైన్ అధికారులు పట్టుకున్నారు. మారుతీనగర్‌లోని నాయీబ్రాహ్మణ కాలనీలో తనిఖీలు చేసిన పోలీసులు... రాజ్యలక్ష్మి అనే మహిళ వినుకొండ సమీపంలోని తండాల నుంచి పసిపాపను తీసుకువచ్చినట్లు గుర్తించారు. చట్టవిరుద్ధంగా దత్తత పత్రాలు లేకుండా పసిపాపను తీసుకువచ్చారంటూ.. రాజ్యలక్ష్మిపై పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో అధికారులు ఫిర్యాదు చేశారు.
ఇదీ చదవండీ... రాష్ట్రంలో కొత్తగా 7,738 కరోనా కేసులు, 57 మరణాలు