బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని.. గుంటూరు అర్బన్ దిశ మహిళ పోలీస్ స్టేషన్లో చైల్డ్ ఫ్రెండ్లీ పోలీస్ కార్నర్‌ను ఎస్పీ అమ్మిరెడ్డి ప్రారంభించారు. ఆపరేషన్ ముస్కాన్‌లో భాగంగా వీధి బాలలను రక్షించినప్పుడు వారిని చైల్డ్ ఫ్రెండ్లీ పోలీస్ కార్నర్లో ఉంచి కౌన్సిలింగ్ ఇస్తామని ఎస్పీ తెలిపారు. సమస్యల పరిష్కారం కోసం స్టేషన్‌కు వచ్చే మహిళలకు ఇది ఉపయోగపడుతుందన్నారు.
తల్లిదండ్రులు ఫిర్యాదు ఇచ్చి కంప్లైంట్ రాసుకునే సమయంలో పిల్లలు ఇక్కడ సరదాగా గడపడానికి చైల్డ్ ఫ్రెండ్లీ కార్నర్ దోహదపడుతుందని ఎస్పీ అన్నారు. బాలల దినోత్సవం రోజున, పండిట్ జవహర్ లాల్ నెహ్రూ జయంతి రోజున దీనిని ప్రారంభించుకోవడం సంతోషకరమన్నారు. అలాగే వారం రోజులు పాటు చైల్డ్ హెల్ప్ లైన్ ఆధ్వర్యంలో వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. దానికి సంబంధించిన పోస్టరును ఆవిష్కరించారు.
ఇవీ చదవండి..