ఇష్టానుసారం తెదేపా కార్యకర్తలను వేధిస్తే చూస్తూ ఊరుకునేది లేదని ఆ పార్టీ అధినేత చంద్రబాబు హెచ్చరించారు. గుంటూరు రాష్ట్ర పార్టీ కార్యాలయానికి వచ్చిన దెందులూరు కార్యకర్తలతో ఆయన విడిగా సమావేశమయ్యారు. పశ్చిమ గోదావరి జిల్లా పోలీసులు ఇష్టారాజ్యంగా తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అనుచరులు మొరపెట్టుకున్నారు. ప్రభాకర్తో పాటు తెదేపాలో చురుకైన కార్యకర్తలపైనా ఎస్సీ, ఎస్టీ కేసులను మోపుతూ హింసిస్తున్నారని తెలిపారు. పోలీసులు హద్దుల్లో వ్యవహరించాలని చంద్రబాబు హితవు పలికారు.
ఇదీ చదవండి:చట్టం వైకాపా నాయకులకు చుట్టమా?: చంద్రబాబు