ఇదీ చదవండి :
శాంతి సందేశమే.. క్రిస్మస్ వేడుక ఉద్దేశం: చంద్రబాబు - సెమీ క్రిస్మస్ వేడుకల్లో చంద్రబాబు
దేశ, రాష్ట్ర ప్రజలకు తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. మంగళగిరి తెదేపా జాతీయ కార్యాలయంలో నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకుల్లో ఆయన పాల్గొన్నారు. ప్రపంచానికి శాంతి సందేశం అందించేందుకు ఏసు క్రీస్తు సామాన్య మానవునిలా జన్మించారని, ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఏసుమార్గంలో క్రిస్టియన్ మిషనరీలు చేస్తోన్న సేవలను చంద్రబాబు శ్లాఘించారు.
సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న చంద్రబాబు
దేశ, రాష్ట్ర ప్రజలకు తెదేపా అధినేత చంద్రబాబు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. తెదేపా ప్రభుత్వంలో అత్యంత వైభవంగా క్రిస్మస్ వేడుకలు నిర్వహించామని గుర్తు చేసుకున్నారు. లోక కల్యాణం కోసం శాంతి సందేశం ఇవ్వడమే క్రిస్మస్ పండగ ప్రధానోద్దేశమని చంద్రబాబు ఉద్ఘాటించారు. ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వపరంగా క్రిస్మస్ వేడుకలకు నాంది పలికామని చంద్రబాబు తెలిపారు. తమ ప్రభుత్వంలో పేదలకు క్రిస్మస్, రంజాన్, సంక్రాంతి పండగలకు కానుకలిచ్చి వారి కుంటుంబాల్లో సంతోషాన్ని నింపామన్నారు. ఆనందకర జీవితం ఇవ్వడమే ఏసుప్రభువు బోధనల సారాంశమని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఏసుక్రీస్తు మనిషిగా పుట్టి అనేక సమస్యలు ఎదుర్కొని శాంతి సందేశమిచ్చారని చంద్రబాబు కొనియాడారు. ఏసుక్రీస్తు మార్గంలో క్రిస్టియన్ మిషనరీలు సేవాభావంతో పని చేస్తున్నాయని చంద్రబాబు స్పష్టం చేశారు.
ఇదీ చదవండి :
sample description