ETV Bharat / city

రాయపాటి నివాసంలో సీబీఐ సోదాలు..పలు పత్రాలు స్వాధీనం - cbi rides on ex mp rayapati sambasiva rao

గుంటూరులోని మాజీ ఎంపీ, తెదేపా నేత రాయపాటి సాంబశివరావు నివాసంలో కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) సోదాలు చేపట్టింది. ట్రాన్స్​ట్రాయ్ సంస్థ వ్యవహారాలపై రాయపాటిని సీబీఐ అధికారులు ప్రశ్నించారు. ఏడు గంటల పాటు సాగిన సోదాల్లో పలు పత్రాలను అధికారులు వెంట తీసుకెళ్లారు.

ex mp rayapati sambasiva rao
ex mp rayapati sambasiva rao
author img

By

Published : Dec 18, 2020, 12:13 PM IST

Updated : Dec 18, 2020, 4:24 PM IST

మాజీ ఎంపీ, తెదేపా నేత రాయపాటి సాంబశివరావు నివాసంలో సీబీఐ సోదాలు ముగిశాయి.ట్రాన్స్‌ట్రాయ్‌ నిర్మాణ సంస్థ వ్యవహారాలపై సీబీఐ అధికారులు విచారణ జరిపారు. ట్రాన్స్‌ట్రాయ్‌ కంపెనీలో రాయపాటికి వాటాలున్నాయి. సదరు సంస్థ రుణాల ఎగవేతపై సీబీఐ కేసు నడుస్తోంది. ఇందులో భాగంగానే రాయపాటి నివాసంలో సోదాలు నిర్వహించారు. ఈ రోజు ఉదయం 8 గంటలకు సీబీఐ అధికారులు రాయపాటి నివాసానికి చేరుకున్నారు. ఆసమయంలో రాయపాటి కూడా ఇంట్లోనే ఉన్నారు. ఇంట్లోని వివిధ గదులు, కార్యాలయంలో తనిఖీలు చేపట్టారు.

మాజీ ఎంపీ రాయపాటి నివాసంలో సీబీఐ సోదాలు

రుణ వ్యవహారంపై ఆరా..!

ట్రాన్స్ ట్రాయ్ కంపెనీకి సంబంధించిన డాక్యుమెంట్లు సీబీఐ అధికారులు పరిశీలించారు. అలాగే బ్యాంక్ నోటీసులు తమ వెంట తీసుకెళ్లారు. రాయపాటి వాంగ్మూలం కూడా అధికారులు నమోదు చేసుకున్నారు. ట్రాన్స్ ట్రాయ్ తో రాయపాటికి ఉన్న సంబంధంపై ప్రశ్నించారు. ఈ తనిఖీల్లో సీబీఐతో పాటు కెనరా బ్యాంక్ అధికారులు కూడా పాల్గొన్నారు. ఇవాళ ఉదయం 7 గంటలకు రాయపాటి ఇంటికి వచ్చిన సీబీఐ బృందం మధ్యాహ్నం 3 గంటలకు సోదాలను ముగించింది. కెనరా బ్యాంక్ - ట్రాన్స్ ట్రాయ్ మధ్య ఉన్న రుణ వ్యవహారం పైనే విచారణ జరిగినట్లు రాయపాటి కుటుంబ సభ్యులు తెలిపారు. ఏడు గంటల పాటు సోదాలు నిర్వహించిన సీబీఐ అధికారులు తమ వెంట కొన్ని పత్రాలు తీసుకెళ్లారు.

ఇదీ చదవండి

'వృత్తిజీవితం చివరిదశలో కొత్త విషయం అనుభవంలోకి వచ్చింది'

Last Updated : Dec 18, 2020, 4:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.