ETV Bharat / city

Dilapidated Bridges : శిథిలావస్థలో వంతెనలు.. ప్రమాదం అంచున ప్రయాణాలు.. - Guntur-Tenali route

Dilapidated bridges : ప్రమాదాలు చెప్పిరావు.. అప్రమత్తంగా ఉండటమే ముందున్న మార్గం. నెల్లూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఇటీవల వంతెనల పైనుంచి వాహనాలు కిందకు పడిపోయిన ఉదంతాలు తీవ్ర విషాదం నింపాయి. ఈ నేపథ్యంలో శిథిలావస్థలో ఉన్న గుంటూరు-తెనాలి మార్గంలోని పాత చప్టాలు, చిన్నపాటి వంతెనలపై "ఈటీవీ భారత్" ప్రత్యేక కథనం...

Dilapidated bridges
శిథిలావస్థలో వంతెనలు... ప్రమాదం అంచున ప్రయాణాలు...
author img

By

Published : Dec 17, 2021, 6:47 PM IST

Dilapidated bridges : ప్రమాదాలు చెప్పిరావు... అప్రమత్తంగా ఉండటమే మన ముందున్న మార్గం. నెల్లూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఇటీవల వంతెనల పైనుంచి వాహనాలు కిందకు పడిపోయిన ఉదంతాలు తీవ్ర విషాదం నింపాయి. ఈ నేపథ్యంలో గుంటూరు-తెనాలి మార్గంలోనూ పాత చప్టాలు, చిన్నపాటి వంతెనలు ప్రయాణీకులను భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. శిథిలావస్థకు చేరినా..వాటికి సరైన మరమ్మత్తులు చేపట్టకపోవడంతో ప్రమాదకర స్థితిలో ఉన్న వాటిపైనే ప్రయాణించాల్సి వస్తోంది.

గుంటూరు-తెనాలి మధ్య రవాణా...
గుంటూరు-తెనాలి మధ్య ఒకప్పటి కంటే వాహనాల సంఖ్య భారీగా పెరిగింది. ఈ ప్రధాన రహదారి మధ్య రహదారుల నిర్వహణ మాటేమోగానీ... కల్వర్టులు, చప్టాలు నిర్వహణను మాత్రం గాలికొదిలేశారు. నిర్వహణలోపంతో కాలువలపై వంతెనలు, చప్టాలు మరింత ప్రమాదకరంగా మారాయి. రాత్రిపూట ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంది. పాత చప్టాలు కట్టి ఏళ్లు గడుస్తున్నప్పటికీ కొత్త చప్టాలు ఏర్పాటు ప్రతిపాదన ఇంతవరకూ ముందుకు సాగలేదు. అటుగా ప్రయాణాలు సాగించాలంటేనే భయపడే పరిస్థితులున్నా రాకపోకలు కొనసాగించక తప్పటం లేదు.

అంగలకుదురు వద్ద చప్టా తీరు...
అంగలకుదురు వద్ద చప్టాను పట్టించుకోకపోవడంతో అది ప్రమాదకరంగా మారింది. రహదారి మధ్య భాగం కుంగిపోవడంతో... గోడ కట్టి ఏళ్ల తరబడి రహదారిని కొనసాగిస్తున్నారు. కింద పిల్లర్లు బీటలు వారాయి. పక్కన రక్షిత గోడలు శిథిలావస్థకు చేరి కూలిపోయే దశలో ఉన్నాయి. ఓవైపు గోడ కట్టడంవల్ల రెండోవైపు నుంచి మాత్రమే రాకపోకలు కొనసాగిస్తున్నారు. ఈ మార్గంలో విపరీతంగా ట్రాఫిక్ స్తంభించిపోతోంది. ప్రత్యేకంగా ఓ పోలీస్ కానిస్టేబుల్ ను ఇక్కడ ఏర్పాటుచేసి వాహనాల రాకపోకలను నియంత్రిస్తున్నారు. దినదినగండంగా ఈ మార్గంలో ప్రయాణించాల్సి వస్తోందని ప్రయాణికులు అంటున్నారు.

కొమ్మమూరు కాల్వపైవంతెన....
గుంటూరు-తెనాలి మార్గంలో మిగతా చప్టాల పరిస్థితి ఏమంత మెరుగ్గా లేదు. కొమ్మమూరు కాల్వపైన ఉన్న పైవంతెనకు కూడా సరైన నిర్వహణ లేదు. పక్కన గోడలు తక్కువ ఎత్తులో ఉండి ప్రమాదాలకు ఆస్కారమిచ్చే పరిస్థితిలో ఉన్నాయి. ఇక బుడంపాడు వద్ద చిన్నపాటి చప్టా నిర్వహణ కూడా సక్రమంగా లేదు. అడుగున తూటికాడలు పెరిగిపోయాయి. ఈ ప్రధాన రహదారిపై ప్రస్తుతం ద్విచక్రవాహనాలు, ఆటోల తాకిడి విపరీతంగా పెరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో చప్టాలు, పైవంతెనల నిర్వహణ కీలకంగా మారింది.

వాహనాల తాకిడి పెరిగిన నేపథ్యంలో ప్రధాన రహదారుల్లోని చప్టాలు, పైవంతెనలపై అధికారులు దృష్టిసారించి నిర్వహణ, మరమ్మత్తులు చేపట్టాలని ప్రయాణికులు కోరుతున్నారు. సాధ్యమైనంత త్వరిత గతిన మరమ్మత్తులు చేపడితే ప్రయాణ భద్రత లభిస్తుందని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.

ఇదీ చదవండి : palaparru accident: ద్విచక్రవాహనాన్ని ఢీకొన్న ఆర్టీసీ బస్సు.. ఇద్దరు మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.