ETV Bharat / city

'మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధి పథంలో నడుస్తుంది'

ప్రధాని మోదీ నాయకత్వంలో కేంద్రంలో రెండోసారి అధికారం చేపట్టిన భాజపా దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తుందని... ఆ పార్టీ నేత రావెల కిశోర్ బాబు అన్నారు. భాజపా ఏడాది పాలనపై మాట్లాడిన ఆయన.. ప్రధాని మోదీ ఎన్నో సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నారని గుర్తుచేశారు. కరోనా కష్టాల నుంచి గట్టించేందుకు రూ.20 లక్షల కోట్లతో ఆత్మ నిర్భర్ భారత్ పథకం ప్రకటించారని రావెల అన్నారు.

మోదీ ఏడాది పాలనపై కరపత్రం విడుదల  చేసిన  రావెల కిషోర్ బాబు

author img

By

Published : Jun 11, 2020, 11:47 PM IST

కేంద్రంలో భాజపా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నేటి వరకు భారతదేశ సమగ్రతను, గౌరవాన్ని కాపాడుతుందని ఆ పార్టీ నేత రావెల కిషోర్​ బాబు అన్నారు. సాహసోపేత నిర్ణయాలతో మోదీ ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు. భాజపా రెండోసారి అధికారం చేపట్టి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన గుంటూరులో మాట్లాడారు.

కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లోనూ ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ పథకం పేరిట రూ.20 లక్షల కోట్లు కేటాయించారన్నారు. ఆర్టికల్ 370 రద్దు, ట్రిపుల్ తలాక్, సీఏఏ బిల్లులను తెచ్చారని గుర్తుచేశారు. ప్రధాని మోదీ నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వాలు అభివృద్ధి పథంలో నడుస్తున్నాయన్నారు. మోదీ ఏడాది పాలనపై కరపత్రం విడుదల చేశారు రావెల.

ఇదీ చదవండి : 'అవినీతిని కప్పిపుచ్చేందుకే సీబీ'ఐ'.. ఏడాదంతా కుంభకోణాలే..!'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.