ETV Bharat / city

127 ఘటనల్లో ఒక్కరినైనా అరెస్ట్ చేశారా..?: కన్నా లక్ష్మీనారాయణ - సోము వీర్రాజు అరెస్ట్

ఆలయాలపై దాడులకు సంబంధించి 127 ఘటనలు జరిగితే ఒక్కరినైనా అరెస్ట్ చేశారా అని భాజపా నేత కన్నా లక్ష్మీనారాయణ ప్రశ్నించారు. దాడుల వెనుక రాష్ట్ర ప్రభుత్వం అండదండలున్నాయని ఆరోపించారు.

bjp leader  kanna lakshminarayana
bjp leader kanna lakshminarayana
author img

By

Published : Jan 6, 2021, 3:04 PM IST

ఆలయాలపై వరుస దాడుల వెనుక రాష్ట్ర ప్రభుత్వం అండదండలున్నాయని భాజపా నేత కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. 127 ఘటనలు జరిగితే ఒక్కరినీ కూడా అరెస్ట్ చేయలేదని విమర్శించారు. పైగా మంత్రులు ఎదురుదాడులు చేస్తూ తప్పులను కప్పి పుచ్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. రామతీర్థం ఘటన, సోము వీర్రాజు అరెస్టుకు నిరసనగా గుంటూరు కలెక్టరేట్ ఎదుట భాజపా ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో కన్నా పాల్గొన్నారు.

రాష్ట్రంలో మత మార్పిడులు యథేచ్చగా సాగుతున్నాయని... వాటిని రాష్ట్ర ప్రభుత్వమే ప్రోత్సహిస్తుందని కన్నా ఆరోపించారు. హిందూ మతాన్ని, ధర్మాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. దేవాలయాలపై దాడుల అంశాన్ని చూపించి.. ప్రతిపక్షాలు అభివృద్ధిని అడ్డుకుంటున్నాయని సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు. అసలు రాష్ట్రంలో ఎక్కడ... ఏం అభివృద్ధి చేశారో సీఎం చెప్పాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి

మాజీ మంత్రి భూమా అఖిలప్రియను ప్రశ్నిస్తున్న పోలీసులు.. పరారీలో ఆమె భర్త

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.