ETV Bharat / city

Maha Padayatra: రైతుల యాత్రకు అనుమతిపై హైకోర్టు విచారణ.. డీజీపీకి ఆదేశాలు - ఏపీ తాజా వార్తలు

అమరావతి రైతుల యాత్ర(amaravati farmers to hold maha padayatra news)కు అనుమతిపై నిర్ణయం తీసుకోవాలని డీజీపీని హైకోర్టు(ap high court orders to dgp sawang news) ఆదేశించింది. ఈనెల 28వ తేదీన ఓ నిర్ణయం తీసుకోవాలని.. అందుకు సంబంధించిన సమాచారాన్ని కోర్టుకు సమర్పించాలని ఆదేశాల్లో పేర్కొంది.

ap high court orders to dgp sawang
ap high court orders to dgp sawang
author img

By

Published : Oct 25, 2021, 5:17 PM IST

Updated : Oct 25, 2021, 7:39 PM IST

అమరావతి ఐకాస ఆధ్వర్యంలో తలపెట్టిన న్యాయస్థానం నుంచి దేవస్థానం మహాపాదయాత్ర(amaravati farmers to hold maha padayatra news)పై ఈనెల 28వ తేదీ సాయంత్రం ఐదు గంటలలోగా ఓ నిర్ణయం తీసుకోవాలంటూ హైకోర్టు స్పష్టం చేసింది. వెంటనే స్పందించాలని రాష్ట్ర డీజీపీని ఆదేశించింది(ap high court orders to dgp sawang news). తీసుకున్న నిర్ణయానికి సంబంధించిన సమాచారాన్ని హైకోర్టుకు అందజేయాలని పేర్కొంది.

నవంబరు ఒకటో తేదీ నుంచి డిసెంబరు 17 వరకు మొత్తం 45 రోజుల పాటు పాదయాత్ర చేయాలని అమరావతి ఐకాస నిర్ణయం తీసుకుంది(Amaravati Farmers to Hold Maha Padayatra From Nov 1st news). పాదయాత్రకు అనుమతి ఇవ్వాలని ఇప్పటికే డీజీపీకి వినతిపత్రం అందజేసినా ఇంకా ఎలాంటి నిర్ణయం రాకపోవడంతో హైకోర్టును ఆశ్రయించారు. ఐకాస ప్రతినిధుల తరఫున న్యాయవాది వీవీ లక్ష్మీనారాయణ తన వాదనలు వినిపించారు. అమరావతి రాజధానిగా ఉండడం వల్ల 13 జిల్లాలకు కలిగే ప్రయోజనాలను ప్రజలకు ఐకాస నేతలు వివరిస్తారన్నారు. ఈ పిటిషన్‌ను పరిశీలించిన జస్టిస్ మానవేంద్ర రాయ్.. యాత్రకు అనుమతిపై ఓ నిర్ణయం తీసుకోవాలని డీజీపీని ఆదేశించారు.

ఇప్పటికైనా అనుమతి ఇవ్వండి: రైతులు

హైకోర్టు ఆదేశాలపై అమరావతి రైతులు, మహిళలు హర్షం వ్యక్తం చేశారు. పాదయాత్ర ప్రారంభం నుంచి ముగింపు వరకు తమకు రక్షణ కల్పించాలని కోరారు. ప్రభుత్వం నుంచి తమకు ప్రాణహాని ఉందని, ఎలాంటి అడ్డంకులు లేకుండా సజావుగా సాగేలా పోలీసులు చూడాలని డిమాండ్ చేశారు. డీజీపీ ఇప్పటికైనా కోర్టు ఆదేశాలను పరిగణనలోకి తీసుకొని.. తమ పాదయాత్రకు అనుమతి ఇవ్వాలన్నారు.

ఇదీ చదవండి: MP Bharat: స్వప్రయోజనం కోసమే చంద్రబాబు దిల్లీ పర్యటన: ఎంపీ భరత్

Last Updated : Oct 25, 2021, 7:39 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.