ap-high-court-chief-justice: రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రశాంత్ కుమార్ మిశ్రా దంపతులు.. గుంటూరు జిల్లా మంగళగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న చీఫ్ జస్టిస్ దంపతులకు.. అర్చకులు, ఆలయ అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.
ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం.. అర్చకులు స్వామి వారి చిత్రపటం, తీర్థ ప్రసాదాలు అందజేశారు. స్వామి వారి దర్శనం చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని చీఫ్ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా చెప్పారు. స్వామి దర్శనం అనంతరం చీఫ్ జస్టిస్ దంపతులు శ్రీపానకాల స్వామి ఆలయంలోనూ ప్రత్యేక పూజలు చేశారు.
ఇదీ చదవండి: GV Anjaneyulu: అంగలూరులో జీవీ దీక్షతో.. విద్యుత్ పునరుద్దరణ