గుంటూరు జిల్లాలో ఈ నెల 21వ తేదీన జరగనున్న చివరి విడత పంచాయతీ ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రత్తిపాడు నియోజకవర్గంలోని 56 పంచాయతీలలో 149 మంది సర్పంచి అభ్యర్థులుగా, 1,074 మంది వార్డు మెంబర్లుగా బరిలో నిలిచారు. ప్రత్తిపాడు, పెదనందిపాడు, వట్టిచెరుకూరు, గ్రామీణ గుంటూరు మండలాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఆయా మండలాల్లో ఎన్నికల సిబ్బందికి అధికారులు సామగ్రి పంపిణీ చేశారు.
పటిష్ఠ బందోబస్తు...
పెదకాకాని మండలం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఎన్నికల సిబ్బందికి అవసరమైన సామగ్రిని అధికారులు అందజేశారు. ఉదయం ఆరున్నర గంటలకే పోలింగ్ ప్రారంభమవుతున్నందున సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మండలంలో 300 మంది పోలీసు సిబ్బందితో బందోబస్తును ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అడిషనల్ ఎస్పీ ఈశ్వరరావు, గుంటూరు ఈస్ట్ డీఎస్పీ సీతారామయ్యతో పాటు, 10 మంది సీఐలు, 10 మంది ఎస్ఐలు పాల్గొననున్నారు.
:
ఇదీ చదవండి: