అగ్రి గోల్డ్ బాధితుల మలిదశ ఉద్యమం గుంటూరులో ప్రారంభమైంది. అగ్రిగోల్డ్ బాధితుల విజ్ఞాపన దీక్షలను.. ఆ సంఘం గౌరవాధ్యక్షుడు ముప్పాళ్ల నాగేశ్వరరావు ప్రారంభించారు. భౌతికదూరం పాటిస్తూ బాధితులు విజ్ఞాపన దీక్షలు చేస్తున్నారు. బడ్జెట్‌లో కేటాయించిన రూ.1150 కోట్లు సత్వరమే చెల్లించాలని వారు కోరుతున్నారు. మొత్తం సొమ్ములో 50 శాతాన్ని తక్షణం చెలించాలని డిమాండ్ చేస్తున్నారు. సమస్యను ఆరుసార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని, సీఎంను కలిసేందుకు నాలుగుసార్లు ప్రయత్నించామని ముప్పాళ్ల నాగేశ్వరరావు తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
గుంటూరులో అగ్రి గోల్డ్ బాధితుల విజ్ఞాపన దీక్ష - agri gold scam news
అగ్రిగోల్డ్ బాధితులు మలిదశ విజ్ఞాపన దీక్షలను గుంటూరులో ప్రారంభించారు. బడ్జెట్‌లో కేటాయించిన రూ.1150 కోట్లను సత్వరమే చెల్లించాలని బాధితులు డిమాండ్ చేశారు.