రాష్ట్ర ఎన్నికల కమిషనర్ తొలగింపు వ్యవహారంలో సుప్రీంకోర్టులో జగన్ సర్కారుతో న్యాయ పోరాటానికి ఇతర పక్షాలు సిద్ధమవుతున్నాయి. నిమ్మగడ్డ రమేష్ కుమార్ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా కొనసాగించాలని ఇటీవల హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే అప్లికేషన్ దాఖలు చేసిన రాష్ట్ర ప్రభుత్వం... ఇవాళ పిటిషన్‌ను ఉపసంహరించుకుంది. రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల కమిషన్ వేర్వేరుగా పిటిషన్లు వేయగా.. వీటి ఉపసంహరణకు హైకోర్టు అనుమతించింది. ఇప్పటికే స్టే కోసం సుప్రీంకోర్టులో అప్పీలు దాఖలు చేసినందున హైకోర్టులో స్టే పిటిషన్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకుంది.
- సుప్రీం స్వీకరించలేదు...
మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌ను సుప్రీం ఇప్పటి వరకు విచారణకు స్వీకరించలేదని కాంగ్రెస్ నేత మస్తాన్ వలీ తరపు న్యాయవాది నర్రా శ్రీనివాసరావు చెప్పారు. ఇప్పటికే తాము సైతం కేవియట్ పిటిషన్ దాఖలు చేసినందున సుప్రీం కోర్టు కోరినప్పుడు ఈ విషయంపై తమ అభిప్రాయం చెబుతామన్నారు.
ఇవీ చదవండి: పీజీ మెడికల్ కౌన్సెలింగ్: ప్రతివాదులకు హైకోర్టు నోటీసులు