ETV Bharat / city

అంతా కలిసి ఈతకు వెళ్లారు, స్నేహితుడు గల్లంతైనా ఎవరికీ చెప్పని మిత్రులు

student gallantu స్నేహితులంతా కలిసి ఈత కొట్టడానికి కెనాల్ కాలువలోకి దిగారు. వారిలో ఓ యువకుడు నీటిలో గల్లంతయ్యాడు. ఈ విషయాన్ని అతని తల్లిదండ్రులకు చెప్పకుండా మిగతా స్నేహితులు దాచారు. సాయంత్రం దాటినా తమ కొడుకు కనిపించకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందారు. కుమారుడు స్నేహితులను వివరాలు తెలిస్తే చెప్పాలని అడిగారు. తమకు తెలియదంటూ తప్పించుకునే ప్రయత్నం చేశారు. చివరకు కాలువ సమీపంలో సాంబశివరావు బట్టలతో పాటు చరవాణి లభించడంతో కెనాల్​లో సాంబశివరావు గల్లంతయ్యాడని అతని స్నేహితులు తెలిపారు.

student gallant
ఈతకు వెళ్లిన విద్యార్థి కానరాకుండా పోయాడు
author img

By

Published : Aug 24, 2022, 3:52 PM IST

Student missing: గుంటూరు జిల్లా దుగ్గిరాలకు చెందిన ఇంటర్ విద్యార్థి కొల్లి సాంబశివరావు బకింగ్ హామ్ కెనాల్​లో ఈతకు దిగి గల్లంతయ్యాడు. మంగళవారం సాయంత్రం ఏడుగురు స్నేహితులంతా కలిసి కాలువలో స్నానానికి దిగారు. కాసేపటి తరువాత సాంబశివరావు గల్లంతయ్యాడు. దీంతో మిగిలిన స్నేహితులు భయంతో ఇంటికి వెళ్లిపోయారు. ఈ విషయాన్ని దాచిపెట్టారు. మంగళవారం సాయంత్రం నుంచి సాంబశివరావు కోసం తల్లిదండ్రులు దుగ్గిరాలలో గాలించారు. అతని స్నేహితులను అడిగినా.. తమకు తెలియదని చెప్పారు. సాంబశివరావు చరవాణికి ఫోన్ చేసినా స్పందన రాకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు.

బుధవారం ఉదయం కాలువ సమీపానికి వెళ్లిన కొంతమందికి సాంబశివరావు దుస్తులు, చరవాణి కనిపించడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో స్నేహితులను గట్టిగా నిలదీయగా అసలు విషయం చెప్పారు. తామంతా నిన్న సాయంత్రం కాలువలో స్నానానికి దిగామని.. సాంబశివరావు గల్లంతు కావడంతో భయంతో ఇంటికి తిరిగి వచ్చేశామన్నారు. విషయం తెలుసుకుని తల్లిదండ్రులు విషాదంలో మునిగిపోయారు. గల్లంతైన సాంబశివరావు కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.