గుంటూరు జిల్లా మాచర్లలో దారుణం జరిగింది. రామకృష్ణ అనే వ్యక్తి.. అనారోగ్యంతో మంచాన పడి ఉన్న తన తల్లి లీలావతిని గొంతుకోసి హత్య చేశాడు. పట్టణంలోని సుద్దగుంతల వీధిలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ప్రస్తుతం ఈ ప్రాంతం రెడ్జోన్లో ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. నిందితుడు పరారీలో ఉన్నాడు.
హైదరాబాద్ నుంచి వచ్చిన రామకృష్ణ.. 15 రోజులుగా వృద్ధురాలైన తల్లికి సేవ చేయలేకే.. తాగిన మైకంలో ఈ హత్య చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. నిందితుడి కోసం గాలిస్తున్నారు. మృతురాలికి ఇటీవల కరోనా పరీక్షలు నిర్వహించగా.. ఇంకా ఫలితం రావాల్సి ఉంది.
ఇదీ చూడండి..