ETV Bharat / city

24 గంటలు.. 550 కేసులు.. 6 మరణాలు

గుంటూరు జిల్లాలో కరోనా వేగంగా విస్తరిస్తోంది. గడిచిన 24 గంటల్లో 550 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆరుగురు వైరస్ కారణంగా ప్రాణాలు విడిచారు. జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 49,484కు చేరింది. ఇప్పటివరకు 40,235 మంది కోలుకొని ఇళ్లకు వెళ్లారు.

550-positive-corona-cases-reported-in-guntur-district
24 గంటలు.. 550 కేసులు.. 6 మరణాలు
author img

By

Published : Sep 17, 2020, 10:21 PM IST

గుంటూరు జిల్లాలో కరోనా వైరస్ ఉద్ధృతి కొనసాగుతోంది. జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 50 వేలకు చేరువైంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 550 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో జిల్లావ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 49 వేల 484కి చేరింది. ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకుని 40 వేల 235 మంది ఇళ్లకు చేరుకున్నారు. తాజాగా వైరస్ ప్రభావంతో ఆరుగురు మృతి చెందగా.. మొత్తం మరణాల సంఖ్య 481కి చేరింది. రాష్ట్రంలోనే అత్యధిక మరణాలు సంభవించిన జిల్లాల్లో గుంటూరు జిల్లా రెండో స్థానంలో నిలిచింది.

కొత్తగా నమోదైన కేసుల్లో గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో 75 కేసులున్నాయి. ఇక మండలాల వారీగా నమోదైన కేసుల వివరాలు ఇలా ఉన్నాయి... నరసరావుపేట-69, చిలకలూరిపేట-36, మంగళగిరి-30, రొంపిచర్ల-30, తెనాలి-28, రేపల్లె-26, నగరం-24, బాపట్ల-24, గురజాల-22, వినుకొండ-13, పెదకాకాని-13, తాడికొండ-12, కారంపూడి-10, చెరుకుపల్లి-11 చొప్పున కేసులు నమోదయ్యాయని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు.

ఇదీ చదవండీ... రాష్ట్రంలో 6 లక్షలు దాటిన కరోనా కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.