ETV Bharat / city

తీసుకెళ్లిన సొమ్ము అయిపోయింది.. ఇంటికి వచ్చిన వాళ్లకు షాక్​..!

author img

By

Published : Sep 14, 2021, 12:44 PM IST

నమ్మకంగా ఉన్నాడు.. అందరితో కలిసి మెలిసి తిరిగాడు.. ఎలాగైనా నగదుతో ఉడాయించాలని ప్రణాళిక రచించాడు.. తన ఇద్దరు స్నేహితులతో కలిసి బ్యాంకులో జమ చేయాల్సిన నగదును దోచుకెళ్లాడు. ఏకంగా రూ. 1.26 కోట్లతో ఉడాయించిన ఆ నిందితులను ఎట్టకేలకు నెల్లూరు సీసీఎస్‌, చిన్నబజారు పోలీసులు అరెస్టు చేశారు. ఆయా వివరాలను ఎస్పీ సీహెచ్‌ విజయరావు స్థానిక ఉమేష్‌చంద్ర కాన్ఫరెన్స్‌హాలులో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు.

robbery
robbery

నెల్లూరు సారాయి అంగడి సెంటర్‌కు చెందిన షేక్‌ రబ్బాని మూడేళ్లుగా బాలాజీనగర్‌లోని రైటర్స్‌ సేఫ్‌ గార్డ్స్‌ సంస్థలో కస్టోడియన్‌గా పని చేస్తున్నాడు. సంస్థ నిర్ణయించిన ప్రాంతాలు, సంస్థలు, షాపింగ్‌ మాల్స్‌, ఆసుపత్రుల నుంచి రోజువారీ నగదు తీసుకుని.. ఆయా సంస్థల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తుంటారు. రోజువారీ సేకరణ రూ. కోట్లలోనే ఉంటోంది. ఈ క్రమంలోనే రబ్బాని తన స్నేహితులైన సారాయి అంగడి సెంటర్‌కే చెందిన పాత నేరస్థుడు రఫి అలియాస్‌ గాంధీ, నెల్లూరు గ్రామీణ మండలం దేవరపాలేనికి చెందిన షేక్‌ మస్తాన్‌ అలియాస్‌ దూద్కలతో కలిసి జల్సాల కోసం బ్యాంకులో కట్టాల్సిన నగదుతో ఉడాయించేందుకు ప్రణాళిక రచించారు. అదను కోసం వేచి చూశారు. ఈ ఏడాది ఆగస్టు 31న రబ్బాని, అతడి సహచర ఇద్దరు కస్టోడియన్లు రోజు వారీ కలెక్షన్‌ రూ. 1,26,08,450 సేకరించారు. దాన్ని వివిధ బ్యాంకుల్లో జమ చేయాలని వారు రబ్బానీకి ఇవ్వగా- అదే అవకాశంగా అతడు తన స్నేహితులతో కలిసి నగదుతో ఉడాయించాడు. కొంత మొత్తాన్ని తెలిసిన వారి వద్ద పెట్టి.. మిగిలిన నగదును తమ వెంట తీసుకువెళ్లారు. దీనిపై సంస్థ రూట్‌ లీడర్‌ తిరుపతిరావు ఈ నెల ఒకటో తేదీ చిన్నబజారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నగర, సీసీఎస్‌ డీఎస్పీలు జె.శ్రీనివాసులురెడ్డి, శివాజీరాజా తమ సిబ్బందితో ఎనిమిది ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి.. నిందితుల కోసం గాలింపు చేపట్టారు. సాంకేతికతను వినియోగించారు.

జల్సాల కోసం ఇతర రాష్ట్రాలకు..

నగదుతో ఉడాయించిన నిందితులు జల్సాల కోసం వివిధ రాష్ట్రాలు తిరిగారు. ఉత్తర్‌ప్రదేశ్‌, రాజస్థాన్‌, మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల్లో తిరుగుతూ జల్సాలు చేశారు. తీసుకువెళ్లిన నగదు అయిపోవడంతో.. ఇంట్లో ఉంచిన సొమ్మును తీసుకువెళ్లేందుకు సోమవారం నెల్లూరు వచ్చారు. నవబాల దుర్గాదేవి గుడి సమీపంలోని చెరువుకట్ట వద్ద ఉండగా.. పక్కా సమాచారంతో పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం తమదైన శైలిలో విచారించారు. వారి నుంచి రూ. 1,11,20,000 స్వాధీనం చేసుకుని.. అరెస్టు చేశారు. ఈ కేసు ఛేదనలో కీలక పాత్ర పోషించిన సిబ్బందిని ఎస్పీ సీహెచ్‌ విజయరావు అభినందించారు. నగదు ప్రోత్సాహకాలు అందజేశారు. సమావేశంలో జిల్లా అదనపు ఎస్పీ వెంకటరత్నం, నగర, సీసీఎస్‌ డీఎస్పీలు, చిన్నబజారు, సీసీఎస్‌ ఇన్‌స్పెక్టర్లు ఎం.మధుబాబు, షేక్‌ బాజీజాన్‌ సైదా, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: డివైడర్​ను ఢీ కొట్టిన కారు.. ఇద్దరు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.