ETV Bharat / city

స్వీయ నియంత్రణే మార్గం... ఏలూరు పౌరుల స్ఫూర్తి అనుసరణీయం

కరోనా నియంత్రణకు స్వీయ నియంత్రణే ఉత్తమ మార్గమని అధికారులు సూచిస్తున్నారు. నిత్యావసరాల కొరత రానీయబోమంటున్న అధికారులు... వాటి కోసం గుమిగూడవద్దని హితవు పలికారు. పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ఏలూరు ప్రజలు చూపిస్తున్న చొరవ అభినందనీయమన్నారు.

self-regulation-at-eluru-in-west-godavari
స్వీయ నియంత్రణే మార్గం... ఏలూరు పౌరుల స్ఫూర్తి అనుసరణీయం
author img

By

Published : Mar 26, 2020, 6:24 PM IST

Updated : Mar 26, 2020, 7:37 PM IST

సామాజిక దూరం పాటించాలని సాక్షాత్తూ ప్రధానే చెబుతున్నారు. స్వీయ నియంత్రణ ఉండాలని అధికారులు అంటున్నారు. ఇందుకోసం జనతా కర్ఫ్యూ, లాక్‌డౌన్‌ విధించుకుని నిబంధనలు పాటిస్తున్నాం. అయితే ఉదయం పూట దుకాణాల వద్దకు వచ్చేవారు, అలాగే వాహనాలపై తిరిగే వారు కొందరు ఈ నిబంధనలు అనుసరించడం లేదు. మనకెవరికీ లేదు కదా... మనకు రాదులే... అన్నటువంటి ఆలోచనలతో అజాగ్రత్తగా ఉంటున్నారు. ప్రభుత్వాల మాటలను పెడచెవిన పెట్టిన ఇటలీ, స్పెయిన్‌ దేశాలు భారీ మూల్యం చెల్లిస్తున్నాయి. అందువల్లే ఎవరికి వారు వ్యక్తిగత జాగ్రత్తలు పాటిస్తే వ్యాధి వ్యాప్తిని నివారించటం సులువనే విషయం అందరూ గుర్తించాలి. ఆదివారం జనతా కర్ఫ్యూ విజయంలో కీలక భూమిక పోషించి అందరి ప్రశంసలు అందుకున్నాం. అదే స్ఫూర్తిని అందుకుని స్వీయ నియంత్రణను పాటిస్తూ అధికారులకు సహకరిస్తే కరోనాపై పోరులో మనమూ భాగస్వాములైనట్టే.

అనుసరణీయం

నిత్యావసర దుకాణాలు ఉదయం ఆరు నుంచి 10 వరకూ కూరగాయల దుకాణాలు, చిల్లర దుకాణాలు మధ్యాహ్నం ఒంటి గంట వరకూ ఉంటున్నాయి. అందుకే హడావుడి లేకుండా సామాజిక దూరం పాటిస్తూ సరకులు కొనుగోలు చేసుకునేందుకు వెసులుబాటు లభిస్తోంది. దీన్ని ఉపయోగించుకుని సమదూరం పాటిస్తే అందరికీ క్షేమకరం. ఈ దిశగా ఏలూరులో అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ముగ్గుతో లైన్లు గీసి, కర్రలతో క్యూలైనట్లు ఏర్పాటు చేసి స్టేడియాల్లో కూరగాయల వ్యాపారులతో విక్రయాలు జరిపించారు. దీనివల్ల కాస్తంత సమయమైనా ఏలూరు వాసులు క్రమశిక్షణతో క్యూలైన్లలో నిలబడి కూరగాయలు కొనుగోలు చేశారు. ఈ విధానాన్ని జిల్లాలోని ప్రధాన పట్టణాల ప్రజలకు కూడా అనుసరణీయమే.

అధికారులకు సహకరించాలి

జిల్లాలోని అధికారులు, వైద్యులు, వివిధ శాఖల సిబ్బంది సమన్వయంతో కరోనా నివారణకు అహర్నిషలు పనిచేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా ఏర్పాటు చేసిన బృందాలు నిరంతరం ఇతర ప్రాంతాల నుంచి ఎవరు వచ్చినా వారి ఆరోగ్య పరిస్థితిని నిశితంగా పరిశీలించి ఉన్నతాధికారులకు సమాచారం ఇస్తున్నాయి. గృహాల్లో ఉండని వారిని క్వారంటైన్‌ సెంటర్లలో ఉంచేలా జిల్లాలో ప్రధాన పట్టణాల్లో 1500 గదులు సిద్ధం చేస్తున్నారు. మాస్కులు, పరికరాలు సిద్ధంగా ఉంచారు. అధికారులు ఇన్ని చేస్తున్నప్పుడు వారికి సహకారంగా ప్రజల్లో మార్పు వస్తేనే కరోనా కట్టడి సాధ్యమవుతుంది. సామాజిక దూరం పాటించాలి. వ్యక్తిగత శుభ్రత, స్వీయ నిర్బంధం పాటించాలనే చైతన్యం కలగాలి. అత్యవరమైతేనే బయటికి రావాలనే నియమం పెట్టుకోవాలి. అధికారులు చెబుతున్న విషయాలను దృష్టిలో పెట్టుకోవాలి. శానిటైజర్లు వినియోగించాలి. కరోనా వ్యాప్తి నివారణకు జిల్లాలోని ప్రతివ్యక్తికి బాధ్యత ఉందని గ్రహించాలి. కర్తవ్యం గుర్తెరిగి మసులుకోవాలి.

సామాజిక దూరం పాటించండి

కరోనా వైరస్‌ వ్యాప్తిని తక్కువ అంచనా వేయవద్దు. ప్రజలందరూ ప్రభుత్వ నిబంధనలను పాటించాలి. గుంపులుగా సంచరించరాదు. 144 సెక్షన్‌ పకడ్బందీగా అమలు చేస్తాం. నిబంధనలు అతిక్రమించిన వారిపై నిబంధనల ప్రకారం కేసులు నమోదు చేసి జరిమానా విధిస్తాం. ప్రజలంతా అవగాహనతో మెలగాలి. కరోనాను పారదోలాలి. సామాజిక దూరం పాటించండి. - రేవు ముత్యాలరాజు, కలెక్టర్‌

Last Updated : Mar 26, 2020, 7:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.