ETV Bharat / city

'అతిథి దేవో భవ' సూత్రాన్ని పాటిస్తున్న రోబోలు..! - Robo services news

రోబో సినిమాలో రజనీకాంత్‌ ఆజ్ఞతో చకచకా పనులు చేసే 'చిట్టి' లాంటి రోబోలు ఇప్పుడు మన మధ్యకూ వచ్చేశాయి. ఏలూరులోని ఓ హోటల్‌లో భోజనానికి ఆహ్వానించింది మొదలు... వీడ్కోలు పలికేంతవరకూ 'అతిథి దేవో భవ' సూత్రాన్ని పాటిస్తూ ఆకట్టుకుంటున్నాయి. ఆర్డర్‌ తీసుకున్న నిమిషాల్లోనే వచ్చి స్వయంగా వడ్డిస్తున్న వాటిని చూసి.... చిన్నాపెద్దా కొత్త అనుభూతి పొందుతున్నారు.

robo-services-in-restaurants-in-eluru
'అతిథి దేవో భవ' సూత్రాన్ని పాటిస్తున్న రోబోలు..!
author img

By

Published : Nov 8, 2020, 5:11 AM IST

'అతిథి దేవో భవ' సూత్రాన్ని పాటిస్తున్న రోబోలు..!

శాస్త్రసాంకేతిక విప్లవ ఫలితాలు మన జీవితానికి సుఖసంతోషాలనిస్తున్నాయి. ఏలూరులోని హోటల్ ఆదిత్య ప్రిన్స్‌లో కొసరికొసరి వడ్డిస్తున్న రోబోలు దీనికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. వినియోగదారునికి కొత్త అనుభూతులు అందించేందుకు హోటల్‌ యాజమాన్యం అందుబాటులోకి తీసుకొచ్చిన రోబో ఫుడ్‌ సర్వీసింగ్‌కు మంచి స్పందన వస్తోంది. అమ్మ వడ్డిస్తే తినటానికి వేషాలు వేస్తూ మారాం చేసే పిల్లలు... రోబోను మళ్లీమళ్లీ చూసేందుకు.... ప్లేటులో వడ్డించగానే గుటుక్కుమనిపిస్తున్నారు. రోబోలే స్వయంగా టేబుల్‌ వద్దకు వెళ్లి ఆప్యాయంగా పలకరించి మరీ ఆర్డర్లు తీసుకుంటున్నాయి.

నగరంలో అందరికీ ఈ రోబో సర్వీసింగ్‌ గురించి తెలియటంతో హోటల్‌కు వచ్చేవారి సంఖ్య పెరుగుతోంది. మరమనుషులు క్షణం తీరిక లేకుండా వడ్డిస్తున్నాయి. కొవిడ్‌ దెబ్బకు పూర్తిగా దెబ్బతిన్న హోటల్‌ రంగానికి... రోబో సర్వీసింగ్‌ కొత్త జవసత్వాలు తీసుకొచ్చిందని నిర్వాహకులు తెలిపారు. ప్రారంభంలో పెట్టుబడి ఎక్కువగానే ఉన్నప్పటికీ... దీర్ఘకాలంలో డబ్బు ఆదా అవుతుందని చెబుతున్నారు.

పలకరిస్తూ... వడ్డిస్తూ... అడ్డుగా వచ్చేవారిని సుతారంగా పక్కకు తప్పుకోండని సూచిస్తూ... రోబోలు చేస్తున్న సందడిని వినియోగదారులు ఆసక్తిగా చూస్తున్నారు. ఆహారం, రుచీ బాగుండటంతో.. కొత్త అనుభూతిని ఆస్వాదిస్తున్నారు. ట్రెండ్‌కు తగ్గట్లుగా కొత్త సేవలను అందుబాటులోకి తీసుకొచ్చి కొవిడ్‌ సంక్షోభంలోనూ వ్యాపారాన్ని పరుగులు పెట్టిస్తున్న నిర్వాహకుణ్ని వినియోగదారులు అభినందిస్తున్నారు.

ఇదీ చదవండీ... 'శ్రీదేవి అక్కా.. పేకాట గురించి మాట్లాడలేదని ప్రమాణం చేస్తారా?'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.