ETV Bharat / city

కార్డులో పేరు తొలగింపు అవకాశం పూర్తిగా రద్దు

బియ్యం కార్డుల కోసం నిరీక్షిస్తున్న వారికి సరికొత్త నిబంధనలు చుక్కలు చూపిస్తున్నాయి. దాదాపు రెండేళ్ల నుంచి పశ్చిమగోదావరి జిల్లాలో వేలాది మంది కార్డుల కోసం ఎదురుచూస్తున్నారు. కొత్తగా వివాహమై వేరే కాపురం పెట్టిన వారు, ఎప్పటి నుంచో కార్డులేని వారు దరఖాస్తు చేసుకున్నారు. వీరికి ప్రస్తుత ప్రభుత్వం విధించిన నిబంధనలు బియ్యం కార్డులు పొందేందుకు ప్రతిబంధకంగా మారుతున్నాయి.

ration card
ration card
author img

By

Published : Jun 30, 2020, 1:12 PM IST

ప్రభుత్వం బియ్యం కార్డులు అందించేందుకు ముందుకొచ్చింది. కానీ.. నిబంధనలు దరఖాస్తుదారులను బెంబేలెత్తిస్తున్నాయి. పేరు తొలగింపు ఆప్షన్‌ తీసేయడం, ఒంటరిగా ఉన్నవారి కార్డులను రద్దు చేయడం తదితర అనేక నిబంధనలు కొత్తకార్డు వచ్చే అవకాశాలను దూరం చేస్తున్నాయి. సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు తగ్గించేందుకే ప్రభుత్వం ఇలా వ్యవహరిస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి.

ఇప్పటి వరకు వివాహమైన మహిళ తన పుట్టింటి కార్డులో ఉంటే తన పేరును తొలగించుకునే అవకాశం ఉండేది. వివాహమైన పురుషులు కూడా తమ అమ్మానాన్నల కార్డుల నుంచి పేరు తొలగించుకుని భార్యాభర్తల పేరిట కొత్త కార్డుకు దరఖాస్తు చేసుకునేవారు. అలాంటి వారికి ప్రభుత్వం కొత్త కార్డు మంజూరు చేసేది. తాజాగా బియ్యం కార్డు మంజూరు బాధ్యతలను పూర్తిగా గ్రామ సచివాలయాలకు అప్పగించారు. కార్డులో పేరున్న వ్యక్తి మరణిస్తేనే తొలగించే అవకాశం ఇచ్చారు. పెళ్లయిన మహిళను పుట్టింటి వారి కార్డు నుంచి అత్తవారింటి కార్డులోకి మార్పు చేసేలా విధానం తీసుకొచ్చారు. మార్పు చేసిన తర్వాత అత్తమామ ఇద్దరూ ఉంటేనే కొత్తకార్డుకు అవకాశం ఉంటుంది. ఇద్దరిలో ఎవరైనా మృతి చెందితే అత్త, మామ ఎవరుంటే వారితో కలిసి బియ్యం కార్డులో వీరుండాలి. కొత్త కార్డు రాదు. అంటే సింగిల్‌ కార్డు విధానం పూర్తిగా తీసేశారు.

ఈ విధానం చాలామంది తల్లిదండ్రులకు ఇబ్బందిగా మారనుంది. కొడుకు ఏదైనా నాలుగు చక్రాల వాహనం కొనుగోలు చేసినా, కరెంటు బిల్లు 300 యూనిట్లు దాటినా వారికి వచ్చే వృద్ధాప్య పింఛన్‌ నిలిచిపోనుంది. ప్రస్తుతం చాలామంది కుమారులు తమ తల్లిదండ్రులను పట్టించుకోని పరిస్థితి ఉంది. వృద్ధులైన తల్లిదండ్రులు తమ వంట తామే చేసుకుంటూ ఒంటరిగా జీవనం సాగిస్తున్నారు. ఇలాంటి వారికి ప్రత్యేక బియ్యం కార్డు లేకుంటే.. వచ్చే బియ్యం, సరకులు కుమారులు తీసుకుంటే వీళ్ల పరిస్థితి అగమ్యగోచరంగా మారనుంది. ఇద్దరు కొడుకులు ఉంటే వారిలో ఎవరి కార్డులో చేరాలనే వివాదాలు తలెత్తే అవకాశాలు లేకపోలేదు.

ప్రభుత్వ మహిళా ఉద్యోగులకు చిక్కులు

ఇటీవల గ్రామ, వార్డు సచివాలయాల్లో వేలాది మంది ఉద్యోగాలు పొందారు. వారిలో మహిళలు ఉన్నారు. వివాహమైన చాలామంది మహిళల పేర్లు ఇంకా పుట్టింటి రేషన్‌ కార్డుల్లోనే ఉన్నాయి. ప్రస్తుతం ఉద్యోగం ఉన్న కారణంగా పుట్టింటి వారి బియ్యం కార్డు తొలగించే పరిస్థితి ఏర్పడింది. పోనీ ఆమె పేరును అత్తవారింటి రేషన్‌ కార్డులోకి మార్పు చేస్తే అత్త, మామల్లో ఎవరైనా వృద్ధాప్య పింఛన్‌ తీసుకుంటే అది రద్దయ్యే ప్రమాదం ఉంది. ఫలితంగా ఆయా కుటుంబాల్లో ఆందోళన నెలకొంది. ఒంటరి వారికి కార్డు లేకుండా చేయడం వృద్ధులైన ఇంటిపెద్దకు ఇబ్బందేనన్న వాదన వినిపిస్తోంది. ప్రభుత్వం ఈ అంశాలపై దృష్టి పెట్టాలని దరఖాస్తుదారులు అభ్యర్థిస్తున్నారు.

సింగిల్‌ కార్డు విధానం లేదు

ప్రభుత్వం సింగిల్‌ కార్డు విధానాన్ని రద్దు చేసింది. ప్రభుత్వ ఉద్యోగం పొందిన మహిళకు తొలగింపు ఆప్షన్‌ ప్రస్తుతం లేదు. తర్వాత పెట్టే అవకాశం ఉంది. జిల్లాలోని సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. ప్రస్తుతం సచివాలయాల్లో దరఖాస్తు చేసిన పది రోజుల్లో బియ్యం కార్డు మంజూరు చేస్తున్నాం. - ఎన్‌.సుబ్బరాజు, డీఎస్‌వో

ఇదీ చదవండి: తెలంగాణ: అక్కలపై ఉన్మాదం...ఇద్దరు మృతి, మరొకరి పరిస్థితి విషమం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.