ETV Bharat / city

'స్థానికులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు'

ఏలూరులో అంతుచిక్కని వ్యాధి గురించి స్థానికులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యారోగ్యశాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్ అన్నారు. అన్ని వైరల్ టెస్టులూ నెగిటివ్ వచ్చినట్లు స్పష్టం చేశారు. రేపు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధుల బృందం ఏలూరు రానున్నట్టు వెల్లడించారు.

Health Commissioner on Eluru incident
Health Commissioner on Eluru incident
author img

By

Published : Dec 7, 2020, 2:08 PM IST

Updated : Dec 7, 2020, 2:39 PM IST

ఏలూరు ఘటనపై మాట్లాడుతున్న వైద్యారోగ్యశాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్

అంతు చిక్కని సమస్యతో.. ఏలూరు ప్రభుత్వాస్వత్రిలో చేరుతున్న రోగులందరికీ అన్ని వైరల్ టెస్టులూ చేయించినట్లు.. వైద్యారోగ్యశాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్ తెలిపారు. అన్ని టెస్టులు నెగిటివ్​గా వచ్చాయన్నారు. బ్యాక్టీరియా, ఫంగల్ టెస్టులూ నెగిటివ్ వచ్చాయని స్పష్టం చేశారు. తాగునీటికి సంబంధించిన నమూనా టెస్టులు, అలాగే నీటిలో భారలోహాలకు సంబంధించిన అంశాలపైనా పరిశీలన చేశామన్నారు. ఇక కల్చర్ టెస్టులు మాత్రమే రావాల్సి ఉందన్నారు. దీనికి సంబంధించి ఈ రోజు సాయంత్రానికి ఆ ఫలితాలూ వస్తాయని కాటమనేని భాస్కర్ తెలిపారు.

రక్త నమూనాలతో పాటు వెన్నుపూస నుంచి తీసిన శాంపిళ్లను పరీక్షించినా ఏమీ వెల్లడి కాలేదని కాటమనేని భాస్కర్ తెలిపారు. అయితే మరింత లోతైన అధ్యయనం కోసం సీసీఎంబీ కణజాల పరీక్షలు నిర్వహిస్తుందన్నారు. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ పూణేలోని వైరాలజీ ల్యాబ్, ఎన్సీడీసీ నుంచి కూడా బృందాలు రానున్నాయని వెల్లడించారు.

ఆహారం, నీటితో పాటు పర్యావరణానికి సంబంధించిన అంశాలపైనా అధ్యయనం చేయనున్నట్టు వైద్యారోగ్యశాఖ కమిషనర్ వివరించారు. రేపు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధుల బృందం ఏలూరు రానున్నట్టు తెలిపారు. ఐఐఎంఆర్, ఎయిమ్స్ తదితర బృందాలు వస్తున్నాయన్నారు. స్థానికులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. మున్సిపాలిటీ సరఫరా చేసే నీటితో పాటు బయట సరఫరా అయ్యే నీటిని తీసుకున్నవారిలోనూ ఈ లక్షణాలు కనిపించాయన్నారు. ఏలూరుతో పాటు పరిసర ప్రాంతాలైన దెందులూరు నుంచి కూడా వచ్చిన రోగికి ఇవే లక్షణాలు కనిపించాయన్నారు.

ఇదీ చదవండి: ఏలూరు: ప్రజలకు అస్వస్థతపై సీఎం సమీక్ష.. సమస్యపై ఆరా

Last Updated : Dec 7, 2020, 2:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.