ETV Bharat / city

గోదావరి వరద కష్టాలు, తాగేందుకు నీళ్లు లేక ఇక్కట్లు

author img

By

Published : Aug 30, 2022, 11:48 AM IST

గోదావరి వరదల్లో సర్వం కోల్పోయిన పోలవరం ముంపు మండలాల ప్రజల అవస్థలు అన్నీఇన్నీ కాదు. నిలువ నీడ లేక గుట్టలపై గుడారాలు వేసుకుని కాలం వెళ్లదీస్తున్నారు. కనీసం తాగేందుకు మంచినీళ్లూ దొరక్క ఊట నీటితోనే గొంతు తడుపుకొంటున్నారు. కలుషిత నీటితో చాలా మంది జ్వరాల బారిన పడుతున్నారు. ప్రభుత్వ సాయం సంగతి అటుంచి కనీసం మంచినీళ్లయినా ఇవ్వాలని బాధితులు వేడుకుంటున్నారు.

Godavari floods
గోదావరి

Godavari floods: గోదావరి వరదల ధాటికి ఊళ్లు ఖాళీ చేసిన అనేక గ్రామాల ప్రజలు... ఇప్పటికీ పిల్లాపాపలతో కొండలపైనే బతుకీడుస్తున్నారు. దాదాపు రెండు నెలలుగా గుట్టలపైనే ఉంటున్నా... పట్టించుకున్న వారే లేరు. తిండి సంగతి దేవుడెరుగు... కనీసం మంచినీళ్లు అందించే దిక్కూ లేదు. మంచినీళ్ల కోసం అధికారులకు మొర పెట్టుకున్నా... అరణ్యరోదనగానే మిగిలిపోయింది. తప్పనిసరి పరిస్థితుల్లో ప్రాణాలు కాపాడుకునేందుకు ఊట నీరు తాగుతున్నారు. ఈ నీటి కోసమూ బిందెలు పట్టుకుని మహిళలు కిలోమీటర్ల కొద్దీ నడవాల్సిన దుస్థితి నెలకొంది.

ఊట నీళ్లు తాగేందుకు అసలు వీలుకాకుండా ఉన్నాయి. గత్యంతరం లేక.. సుదూర ప్రాంతాలకు వెళ్లి నీళ్లు తెచ్చుకోలేక.. వేరే దారి లేక కలుషిత నీటినే తాగుతూ గూడెం వాసులు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఇప్పటికే నీళ్లు తాగి గూడెంలో చాలామంది మహిళలు, వృద్ధులు జ్వరాల బారిన పడి మంచానికి పరిమితమయ్యారు. మరికొందరు నొప్పులతో బాధ పడుతున్నారు.

" ఇక్కడ తాగడానికి కూడా మంచినీరు లేక ఇబ్బందులు పడుతున్నాం. ఈ నీళ్లను మీకిస్తే మీరు అస్సలు తాగలేరు. కానీ మాకు వేరే మార్గంలేక ఇవే నీళ్లు తాగి బతుకుతున్నాం. వీటి వల్ల రోగాల బారిన పడుతున్నాం. కొందరు వేడి చేసి తాగుతున్నారు. ఇంకొందరు గ్యాసులు లేక పొయ్యిలపై వేడిచేయలేక అలాగే తాగుతున్నారు. ఎవరూ మా గోడును పట్టించుకోవడం లేదు. చర్మం అంతా పాడైపోతోంది. వైద్యానికి డబ్బులులేక ఏం చేయలేకపోతున్నాం." -ముంపు బాధితులు

వరదలతో అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం ఉన్నా కనీసం వైద్య శిబిరాలు కూడా ఏర్పాటుచేయలేదని ముంపు బాధితులు వాపోతున్నారు. జులై వరదల సమయంలో నాలుగు మాత్రలివ్వడం తప్ప... ఆ తర్వాత ఇటువైపు చూసినవారే లేరని చెబుతున్నారు. రోగాల బాధ పడలేక, అతికష్టమ్మీద ప్రైవేటు వైద్యుల వద్దకు వెళితే... ఖర్చులు భరించలేక పోతున్నామని ఆవేదన చెందుతున్నారు.

"వరదలతో అంటువ్యాధులు ప్రబలుతున్నా అధికారులెవరూ మా సమస్యలు పట్టించుకోవడంలేదు. కనీసం వైద్య శిబిరాలు కూడా ఏర్పాటుచేయలేదు. జులై వరదల సమయంలో నాలుగు మాత్రలివ్వడం తప్ప... ఆ తర్వాత ఇటువైపు చూసినవారే లేరు. రోగాల బాధ పడలేక, అతికష్టమ్మీద ప్రైవేటు వైద్యుల వద్దకు వెళుతున్నాం. ఖర్చులు భరించలేక పోతున్నాం." - ముంపు బాధితులు

తమ గోడు ఆలకించి వారానికి రెండు సార్లైనా మంచినీళ్లు అందించాలని ముంపు ప్రాంత ప్రజలు వేడుకుంటున్నారు.

గోదావరి వరద కష్టాలు

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.