లాక్డౌన్ నేపథ్యంలో రైతులు పండించిన పంటలను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని, రుణాలను మాఫీ చేయాలని, పరిహారాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో అన్నదాతలు నిరసన తెలిపారు. ధాన్యం కల్లాల వద్ద ప్లకార్డులను పట్టుకుని ఆందోళన నిర్వహించారు. కరోనా విపత్తు వలన నష్టపోయిన రైతులను ఆదుకోవాలంటూ నినాదాలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అరకొర చర్యల వలన రైతుల సమస్యలు పరిష్కారం కావడం లేదని అన్నారు. లాక్డౌన్ వల్ల పండించిన పంటలను అమ్ముకోలేకపోతున్నామని... తమ సమస్యలను ప్రభుత్వం తక్షణం పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి