Dog Murder: ఏలూరు జిల్లా ముసునూరు మండలం చింతలవల్లి గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. ఇంట్లో కట్టేసి ఉన్న కుక్కను ఓ వ్యక్తి అత్యంత కిరాతకంగా నరికి చంపాడు. చిన్ని గోపాలస్వామి, అతని భార్య కూరగాయలు అమ్ముకునేందుకు వేరే గ్రామానికి వెళ్లారు. ఇదే సమయంలో సురేష్ అనే వ్యక్తి ఇంట్లో ఉన్న కుక్కను నరికి చంపాడు. కుక్కను చంపి వస్తున్న సురేష్‌ను.. నిర్మల అనే మహిళ ప్రశ్నించింది. కుక్కను ఎందుకు చంపావని..ప్రశ్నించడంతో ఆ మహిళను బెదిరించాడు. ఈ ఘటనపై ఫిర్యాదు చేసేందుకు.. ఇంటి యజమాని పోలీసు స్టేషన్‌కు వెళ్లారు. పోలీసులు స్పందించకపోవడంతో గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. కొద్దిసేపు గ్రామస్తులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. చివరకు బాధితుని ఫిర్యాదు మేరకు ఘటనా స్థలానికి వెళ్లి విచారణ చేపట్టారు. నిందితుడ్ని అరెస్ట్ చేశారు.
ఇదీ చదవండి : రాళ్లతో కొట్టి మహిళ దారుణ హత్య.. ఆ తర్వాత తానూ..