రాజధానికి అమరావతిపై పులివెందలలో ప్రజాభిప్రాయ సేకరణ నిర్విహించాలని.. ఇందులో ప్రభుత్వం నెగ్గితే.. తాము అమరావతిపై ఎలాంటి వ్యాఖ్యలు చేయబోమని సీపీఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో ఆయన మాట్లాడుతు.. అమరావతి రైతుల ఉద్యమానికి కులాలు అంటగట్టారని విమర్శించారు. ఎన్ని కేసులు పెట్టినా భయపడకుండా రైతులు రాజధాని కోసం ఉద్యమం చేస్తున్నారని అన్నారు. అమరావతి రైతుల సభకు రాకుండా రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు గృహనిర్బంధం చేశారని వ్యాఖ్యానించారు.
ఇదీ చదవండి
భూకబ్జాపై దివ్యాంగురాలి వీడియో వైరల్... మంత్రి నుంచి ఫోన్...