ETV Bharat / city

పరిహారం దక్కని ఒక్క రైతునూ.. దత్తపుత్రుడు చూపలేదు : జగన్ - ఏలూరు జిల్లా తాజా వార్తలు

CM Jagan on Rythu Barbarossa: ప్రతి అడుగులోనూ రైతు సంక్షేమమే ప్రధానంగా తమ ప్రభుత్వం ముందుకు సాగుతోందని సీఎం జగన్‌ అన్నారు. వివిధ పథకాల రూపంలో మూడేళ్లలోనే లక్షా 10వేల కోట్లు అన్నదాతలకు అందించామన్నారు. ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతులకు అండగా నిలబడ్డామన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలపైనా విమర్శలు సంధించారు. సీఎం ప్రసంగం సాగుతుండగానే... మహిళలు, రైతులు బయటకు వెళ్లిపోగా ప్రాంగణం ఖాళీగా మారింది.

CM Jagan on Rythu Barbarossa
రైతు భరోసాను ప్రారంభించిన జగన్.
author img

By

Published : May 16, 2022, 2:08 PM IST

Updated : May 17, 2022, 5:41 AM IST

రైతు భరోసాను ప్రారంభించిన జగన్.

CM Jagan on Rythu Barbarossa: ‘రైతు సంక్షేమం, అభివృద్ధిలో తెదేపా ప్రభుత్వానికి.. మనందరి ప్రభుత్వానికి వ్యత్యాసం మీరే గుర్తించి, అందరికీ తెలియజెప్పాలి.. రైతు బాగుంటే రాష్ట్రం బాగుంటుందనే ఉద్దేశంతో ఏడాదికి రూ.13,500 చొప్పున క్రమం తప్పకుండా 50.10 లక్షల మంది రైతులకు సాయం చేస్తున్నాం’ అని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. సోమవారం ఏలూరు జిల్లా గణపవరంలో నాలుగో ఏడాది మొదటి విడత రైతు భరోసా నగదు విడుదల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నగదును రైతుల ఖాతాల్లో జమ చేశారు. అంతకు ముందు సభలో మాట్లాడారు. ‘తెదేపా ప్రభుత్వం రైతులను పట్టించుకున్న దాఖలాలు లేవు. రైతులకు ఇచ్చే వడ్డీలేని రుణాలు గత ప్రభుత్వం ఐదేళ్లలో రూ.782 కోట్లు ఇస్తే.. మనందరి ప్రభుత్వం మూడేళ్లలోనే రూ.1,282 కోట్లు ఇచ్చింది.

ఖరీఫ్‌ సీజన్‌, వ్యవసాయ పనులు మొదలు కాకుండానే మొదటి విడత రూ.7,500లో రూ.5,500 చొప్పున రూ.3,758 కోట్లను సరాసరి మీ ఖాతాల్లోకే వేస్తున్నాం. మిగిలిన రూ.2వేల సాయం కేంద్రం పీఎం కిసాన్‌ కింద నెలాఖరుకు జమ చేస్తుంది. అక్టోబరులో పంట కోత సమయంలో రూ.4వేలు జమ చేస్తాం. సంక్రాంతి సమయంలో మరో రూ.2వేలు ఇస్తాం. నాలుగు విడతల్లో క్రమం తప్పకుండా రైతు భరోసా కింద దాదాపు రూ.23,875 కోట్లు అందించాం. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆహారధాన్యాల ఉత్పత్తి 16 లక్షల టన్నులు పెరిగింది. సుభిక్షంగా వర్షాలు కురిసి అనంతపురం లాంటి కరవు జిల్లాలో సైతం భూగర్భ జలాలు రికార్డు స్థాయిలో పెరిగాయి’ అని పేర్కొన్నారు.

ప్రశ్నించలేని దత్తపుత్రుడిని ఏమనాలి : ‘తెదేపా పాలనలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను వదిలేశారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పాస్‌బుక్‌, సీసీఆర్‌సీ కార్డు ఉన్న ప్రతి రైతుకూ రూ.7 లక్షల చొప్పున పరిహారం అందిస్తున్నాం. రైతులను ఉద్ధరిస్తానని బయల్దేరిన చంద్రబాబు దత్తపుత్రుడు.. అన్ని అర్హతలుండీ పరిహారం పొందని ఒక్క రైతునూ చూపించలేకపోయాడు. గతంలో తెదేపా మేనిఫెస్టోలో చంద్రబాబుతో పాటు దత్తపుత్రుడి ఫొటో పెట్టారు. వీళ్లందరూ చాలరన్నట్లు మోదీ చిత్రం తగిలించారు. ప్రజలను ఎందుకు మోసం చేశారని ప్రశ్నించలేని దత్తపుత్రుడిని ఏమనాలి?

రైతులకు పరిహారం ఇవ్వలేదు.. : గత ప్రభుత్వం వైపరీత్యాలతో నష్టపోయిన రైతులకు ఏళ్లు గడిచినా పరిహారం ఇచ్చిన దాఖలాలు లేవు. ప్రస్తుతం పంట నష్టం జరిగిన తర్వాత ఆ పంటకాలం పూర్తయ్యేలోపే పరిహారం జమ చేస్తున్నాం. రైతుల పొలాల్లో మోటార్లు తీసుకుపోవడం, విద్యుత్తు కోతలు.. న్యాయం కోరిన రైతులపై బషీర్‌బాగ్‌లో కాల్పులు జరిపిన తెదేపా పాలనను గుర్తుచేసుకోండి. 2014 ఎన్నికల్లో చంద్రబాబు ఫొటోతో మేనిఫెస్టో విడుదల చేశారు. తర్వాత దాన్ని తెదేపా వెబ్‌సైట్‌ నుంచి తొలగించడంతోనే వారి చిత్తశుద్ధి ఏంటో తెలుస్తోంది’ అని వ్యాఖ్యానించారు.

పదెకరాల్లోపు ఆక్వా రైతులకు రాయితీ : పదెకరాల్లోపు చెరువులున్న ఆక్వా రైతులకు విద్యుత్తు రాయితీ వర్తింపజేయాలని ఉంగుటూరు ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు కోరగా దీనికి స్పందించిన ముఖ్యమంత్రి ఆక్వా జోన్‌ పరిధిలో ఉన్న పదెకరాల్లోపు రైతులకు ఈ రాయితీ ఉంటుందని ప్రకటించారు. కొల్లేరు రెగ్యులేటర్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో శాసనమండలి ఛైర్మన్‌ కొయ్యే మోసేనురాజు, ఉపముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ, వ్యవసాయ, సహకార మార్కెటింగ్‌శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి, రవాణాశాఖ మంత్రి పినిపే విశ్వరూప్‌, పౌర సరఫరాలశాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

సీఎం సభలో నిరసన..: ముఖ్యమంత్రి మాట్లాడుతుండగా పశ్చిమగోదావరి జిల్లా ఉండి మండలం ఎన్‌ఆర్‌పీ అగ్రహారానికి చెందిన పలువురు మహిళలు లేచి నిలబడి ‘సీఎం గారూ.. మాకు న్యాయం చేయాలి.. గ్రామంలోనే ఇళ్ల స్థలాలు ఇప్పించండి’ అంటూ రాసిన ఫ్లెక్సీలను ప్రదర్శించారు. పోలీసులు వారి చేతుల్లో నుంచి ఫ్లెక్సీలను లాక్కున్నారు. మహిళా సీఐతో పాటు పలువురు మహిళా కానిస్టేబుళ్లు వారిని గ్యాలరీ నుంచి బయటకు తీసుకొచ్చారు.

ఆంక్షలతో సతమతం.. : సీఎం పర్యటన నేపథ్యంలో గణపవరంలో పోలీసులు ఆంక్షలు విధించారు. ఆదివారం నుంచే దుకాణాలను మూయించారు. సోమవారం గణపవరంలో వారపు సంత జరగలేదు. దీంతో పరిసర గ్రామాలవారు తీవ్రంగా ఇబ్బందిపడ్డారు. హెలిప్యాడ్‌ నుంచి సభావేదిక వరకు రహదారికి ఇరువైపులా బారికేడ్లు ఏర్పాటు చేయడంతో సామాన్య ప్రజలు నానా అవస్థలు పడ్డారు. సీఎం హెలిప్యాడ్‌ నుంచి సభా ప్రాంగణానికి కారులో వెళ్లారు. ఆ సమయంలో సుమారు గంటసేపు వాహనాలను నిలిపివేశారు. ఆరోగ్యం బాగాలేదు.. అత్యవసరంగా భీమవరం వెళ్లాలి.. అనుమతివ్వండి’ అని అడిగినా దారి ఇవ్వలేదని నిడమర్రు మండలానికి చెందిన ఒక రోగి బంధువులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం కాన్వాయ్‌ వెళ్లిన సుమారు 20 నిమిషాల తర్వాత ఆ వాహనానికి అనుమతి ఇచ్చారు.

ఇవీ చదవండి:

Last Updated : May 17, 2022, 5:41 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.